AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Price: ఎల్‌పిజి సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి నెలకు కొత్త ధరల పట్టికను విడుదల చేసిన చమురు సంస్థలు.. గ్యాస్ ధరలు ఇలా తెలుసుకోండి..

LPG Cylinder Price: భారతీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను విడుదల చేశాయి. సబ్సిడీ లేని..

LPG Cylinder Price: ఎల్‌పిజి సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి నెలకు కొత్త ధరల పట్టికను విడుదల చేసిన చమురు సంస్థలు.. గ్యాస్ ధరలు ఇలా తెలుసుకోండి..
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2021 | 1:24 AM

Share

LPG Cylinder Price: భారతీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను విడుదల చేశాయి. సబ్సిడీ లేని సిలిండర్ల ధర (ఢిల్లీలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర) పెరగలేదు. అంటే.. పాత ధర 694 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ .191 పెంచారు. దాంతో రూ. 1349 రూపాయలకు లభించే సిలిండర్ ఇప్పుడు రూ .1540 కు లభిస్తుంది. ఏజెన్సీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఐదు కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .445 గా ఉంది.

అయితే, డిసెంబర్ నెలలో వంట గ్యాస్ ధరను రెండుసార్లు పెంచారు. నవంబర్‌లో రూ. 594 రూపాయలు ఉండగా, ఆ రేటును డిసెంబర్ 1 న రూ. 644 లకు, ఆ తరువాత డిసెంబర్ 15 న మళ్లీ రూ. 694 లకు పెంచారు. అంటే నెల రోజుల వ్యవధిలోనే రూ.100 రూపాయలు పెంచారు. డిసెంబర్ తరువాత జనవరి నెలలో ఎల్పీజీ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించిందని చెప్పాలి.

అయితే వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రం పెంచారు. జనవరి నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 56 పెంచారు. నంబర్ నెలలో కమర్షియల్ గ్యాస్ ధర రూ. 1241.50 లుగా ఉండగా, డిసెంబర్ 1న పెంచిన ధరతో కలిపి రూప. 1296కు చేరింది. డిసెంబర్ 15న మరోసారి దాని ధరను పెంచారు. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1333కి చేరింది. ఇదంతా ఇలాఉంటే.. తాజాగా పెరిగిన ధరతో కలుపుకుని కమర్షియల్ గ్యాస్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 1540 కి లభిస్తోంది.

ఎల్‌పిజి ధరను ఇలా చెక్ చేయండి.. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ చమురు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అందులో అన్ని చమురు కంపెనీలకు చెందిన ధరలు కనిపిస్తాయి. గ్యాస్ సిలిండర్ ధరలను https://iocl.com/Products/IndaneGas.aspx ఈ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.

Also read:

Trump: ట్రంప్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..? ‘క్యాపిటల్‌ భవనంపై దాడికి ఆయనే ఆహ్వానించాడంటూ’..

China Govt: వీగర్ తెగ పై చైనా ప్రభుత్వం దాష్టీకం.. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సర్కార్..