Trump: ట్రంప్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..? ‘క్యాపిటల్‌ భవనంపై దాడికి ఆయనే ఆహ్వానించాడంటూ’..

US Capitol Rioters Accused Blame Trump: అమెరికా అధ్యక్ష పదవిని వీడే సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అపకీర్తిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సజావుగా జరగలేవంటూ, తన ఓటమిని అంగీకరించేది..

Trump: ట్రంప్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..? 'క్యాపిటల్‌ భవనంపై దాడికి ఆయనే ఆహ్వానించాడంటూ'..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 12:46 AM

US Capitol Rioters Accused Blame Trump: అమెరికా అధ్యక్ష పదవిని వీడే సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అపకీర్తిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సజావుగా జరగలేవంటూ, తన ఓటమిని అంగీకరించేది లేదంటూ భీష్మించి కూర్చున్న ట్రంప్‌ తన అనుచరులను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసిన విషయం విధితమే. ఈ సమయంలో ఐదుగురు మరణించిండంతో తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక క్యాపిటల్‌ భవనంపై దాడి చేసే విషయం ట్రంప్‌నకు ముందే తెలుసని.. ఆయన ఇచ్చిన పిలుపుమేరకే ట్రంప్‌ అనుచరులు దాడికి దిగారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌పై అభింశసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈనెల 8వ తేదీన అభిశంసనపై విచారణ జరగనుంది. ఒకవేళ ట్రంప్‌ అభిశంసన తీర్మానం గనుక ఆమోదం పొందితే.. ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న పరిమాణాలు చూస్తుంటే.. అభింశస తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్యాపిటల్‌ భవనంపై దాడికి యత్నించిన వారిలో ఒకరైన వాషింగ్టన్‌కు చెందిన 20 ఏళ్ల జాక్సన్‌ అనే వ్యక్తి పోలీసులకు దొరికాడు. క్యాపిటల్‌ భవనంపై దాడి సందర్భంలో రికార్డు అయిన వీడియో ఆధారంగా పోలీసులు జాక్సన్‌ను అరెస్ట్‌ చేశారు. తాజాగా కోర్టులో ట్రయల్‌కు హాజరైన జాక్సన్‌ కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఇచ్చిన పిలుపు మేరకే తాను క్యాపిటల్‌ భవన్‌పై దాడికి దిగానని జాక్సన్‌ కోర్టులో చెప్పుకొచ్చాడు. ఇక జాక్సన్‌ తరపున వాదిస్తోన్న లాయర్‌ కూడా కోర్టుకు ఇదే విషయాన్ని వెల్లడించాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉద్వేగభరితంగా చేసిన వ్యాఖ్యల కారణంగానే జాక్సన్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి వెళ్లాడని కోర్టుకు వివరించాడు. కాబట్టి జాక్సన్‌ను విడుదల చేయాలని జనవరి 22న కోర్టుకు లిఖిత పూర్వకంగా విన్నవించుకున్నాడు. మరి మరికొన్ని రోజుల్లో ట్రంప్‌ అభిశంసన తీర్మానంపై విచారణ జరగనున్న నేపథ్యంలో జాక్సన్‌ కోర్టుకు తెలిపిన వివరాలు ఎంత మేర ప్రభావితం చేస్తాయి. ట్రంప్‌ అభిశంసన ఖరారైనట్లేనా.. అయితే ట్రంప్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో వేచి చూడాలి.

Also Read: దుబాయి చేరుకున్న భారత ఉత్పాదక వ్యాక్సిన్ కోవిషీల్డ్.. భారతీయులకు మాత్రం టీకా ఆంక్షలు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?