China Govt: వీగర్ తెగ పై చైనా ప్రభుత్వం దాష్టికం.. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సర్కార్..

China Govt: అణచివేతలకు కేరాఫ్‌గా చెప్పుకునే చైనా ప్రభుత్వంలో మరో దాష్టికానికి పాల్పడింది. చైనాలోని వీగర్ తెగపై ఆదేశ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

China Govt: వీగర్ తెగ పై చైనా ప్రభుత్వం దాష్టికం.. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సర్కార్..
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Feb 03, 2021 | 6:12 AM

China Govt: అణచివేతలకు కేరాఫ్‌గా చెప్పుకునే చైనా ప్రభుత్వంలో మరో దాష్టికానికి పాల్పడింది. చైనాలోని వీగర్ తెగపై ఆదేశ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. జాతి, మత పరంగా వీగర్ ప్రజల పట్ల మరింత వివక్షత చూపుతోంది. అంతేకాదు.. వీగర్లను ఉగ్రవాదుల గాటన చేర్చి.. నిర్బంధ క్యాంపుల్లో పెట్టి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(పీఆర్‌సీ) హింస్తోంది. అయితే పీఆర్‌సీ దమనకాండను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. చైనా తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తోంది. తాజాగా గ్జిన్ జియాంగ్ ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను చైనా ప్రభుత్వం తొలగించింది. దాంతో వీగర్ల కష్టాలు మరోసారి ప్రపంచం దృష్టిన పడ్డాయి.

చైనీయులకు విభిన్నంగా ఉన్న వీగర్ వర్గంలో అత్యధికులు ముస్లింలే.. చైనాలోని వాయువ్య ప్రాంతం గ్జిన్ జియాంగ్ లో వీగర్ తెగ(ముస్లిం)కు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీగర్ జనాభా అధికారికంగా 1.1కోట్లుగా ఉండగా, అనధికారికంగా వీరి సంఖ్య 2.6 కోట్లు ఉంటుందని అంచనా. గ్జిన్ జియాంగ్ ప్రాంతానికి ఎనిమిది దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. మంగోలియా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్,పాకిస్థాన్, భారత్ ఆ ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్నాయి. అయితే, చైనా ప్రభుత్వం వీగర్ ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించడానికి ప్రధాన కారణం వారు ముస్లింలు కావడమే. చైనీయులకు విభిన్నంగా ఉన్న వీగర్ వర్గంలో అత్యధికులు ముస్లింలే ఉంటారు. ఈ జాతి ప్రజల్లో చైనా మూలాలు లేవనే కారణంతో ఆదేశ ప్రభుత్వం వీగర్ల పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉంటోందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే, ఇప్పటి వరకు 56 ఎథ్నిక్ మైనారిటీ గ్రూపులను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(పీఆర్ సీ) గుర్తించింది. ‘హన్ చైనీస్’ మూలాలులేని జాతిగా పేరొందిన వీగర్లు.. చైనాలో మైనారిటీలుగా గుర్తింపు పొందారు. వీరు అధికంగా ఉన్న గ్జిన్ జియాంగ్ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో వీగర్ అధికార భాషగా కొనసాగుతోంది. ఇది టర్కిక్ కుటుంబానికి చెందిన భాష. కాగా, వీగర్లు ఎక్కువగా ఉన్న గ్జిన్ జియాంగ్ ప్రాంతాన్ని పీఆర్‌సీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో ఇప్పటి వరకు బోధనా భాషగా ఉన్న ‘వీగర్’ను చైనా ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు.. విద్యార్థులెవరూ వీగర్ భాషలో మాట్లాడకూడదని నిషేధం విధించింది. వీగర్లను నిర్బంధ క్యాంపుల్లో పెట్టి దుర్మార్గ పాలన సాగిస్తోంది. నిర్బంధ క్యాంపుల్లో ఉన్న వీగర్లంతా మాండరిన్(చైనా భాష) నేర్చుకోవాలని వారిపై చైనా అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. వీగర్లను మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఈ ప్రాంతం ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతి వాదమనే మూడు దుష్ట శక్తులను ఎదుర్కొంటోందంటూ గ్జిన్ జియాంగ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

వీగర్ల పట్ల పీఆర్‌సీకి దాష్టికానికి మరో ఉదాహరణ జులై 2014లో రంజాన్ పండుగ. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులెవరూ కూడా రోజా(ఉపవాసం) ఉండకూడదని గ్జిన్ జియాంగ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన వీగర్ల జాతికి చెందిన అతివాద గ్రూపులు.. ప్రతిగా ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశాయి. దాంతో పీఆర్‌సీ అధికారులు మరింత రెచ్చిపోయారు. వీగర్లపై అణిచివేత ప్రారంభించారు. 2017 నాటికి కనీసం 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్లు పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2017-2018 కాలంలోనే ఈ నిర్బంధ క్యాంపుల నిర్మాణం జరిగిందని అంచనా వేస్తున్నారు.

చైనా వైఖరిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందనలు.. గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో వీగర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తోన్న పీఆర్‌సీ విధానాలపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందనలు వస్తున్నాయి. గ్ఙిన్ జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు చేసింది. ఈ నిర్బంధకాండకు నిరసనగా.. చైనా నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది అమెరికా. కాగా, గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలపై హింసకు పాల్పడుతోందని అమెరికా కాంగ్రెస్ కమిషన్ నివేదికలో వెల్లడింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలకు చెందిన 16వేల ప్రార్థనా ఆలయాలను కూల్చివేశారని ఆస్ట్రేలియా నిఫుణుల అధ్యయన నివేదికలో వెల్లడించారు. వీగర్ ప్రజల హక్కులను చైనా ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ఆన్ చైనా కూడా వెల్లడించింది. పశ్చిమ గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో దాదాపుగా 10 లక్షల వీగర్లకు రీ ఎడ్యుకేషన్ కార్యక్రమం కొనసాగుతోందని 2018 ఆగస్టులో ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక కమిటీ వెల్లడించింది. ఇవన్నీ ఇలా ఉంటే మరో భయంకరమైన విషయమేంటంటే.. జులై 2020.. వీగర్లకు చైనా బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తోందని యూకే ఫారెన్ సెక్రటరీ డోమ్నిక్ రాబ్ ఆరోపించింది.

Also read:

ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. కొత్తగా ఇన్‌చార్జిలను నియమించిన అధిష్టానం

స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి