
Lancet Study : కరోనా వైరస్.. గతేడాది వచ్చిన దానికంటే ఎక్కువగా ఈసారి ప్రజలను పీడిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చిన్న జలుబు, జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమో అన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. తొలిదశ వ్యాప్తితో పోల్చుకుంటే.. రెండోదశలో మహమ్మారి లక్షణాలు భిన్నంగా కనిపిస్తుండడం కూడా దీనికి ఒక కారణమే. సెకండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల బ్రిటన్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 40 ఏళ్ళలోపు వయసున్నవారికి శరీర ద్రవ్యరాశి సూచిక (బాడీ మాస్ ఇండెక్స్-బీఎంఐ) (Body mass index-bmi ) విలువ ఉండాల్సిన దానికంటే మాత్రం ఎక్కువగా ఉన్నవారికి ఈ కరోనా ముప్పు అధికంగా పొంచి ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది.
అయితే సాధారణంగా బీఎంఐ విలువ 23 కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లుగా అర్తం. కానీ అంతకు మించి ఒక్కపాయింట్ పెరిగిన ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అలాంటి వారికి వైరస్ సోకితే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స చేయించుకునే అవసరం 5 శాతం ఎక్కువగానూ, ఇంటెన్సివ్ కేర్ లో చేరే అవకాశాలు 10 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని సర్వేలో తేలింది. దీనిప్రభావం 40 ఏళ్లలోపు ఉన్నవారిపై అధికంగా ఉంటుంది. దాదాపు 7 మిలియన్ల మందిపై పరిశోదన చేసి ఈ విషయాన్ని గుర్తించినట్లుగా ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ లాన్ సెట్ డయాబెటిక్స్ అండ్ ఎండోకెనాలజీలో ఓ కథనం ప్రచురితమైంది. Corona Virus
ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?