AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata Yellow Taxi: కోల్‌కతా పసుపు టాక్సీ అంబాసిడార్ కు చివరి రోజులు వచ్చేశాయా? ఇక చరిత్రలో కలిసిపోవడమేనా?

Kolkata Yellow Taxi: కోల్‌కతా పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్, రాసగుల్లా, ఫుట్‌బాల్ వీటితో పాటు అక్కడ భయంకర ట్రాఫిక్ లో దూసుకుపోతూ కనిపించే పసుపు టాక్సీలు.

Kolkata Yellow Taxi: కోల్‌కతా పసుపు టాక్సీ అంబాసిడార్ కు చివరి రోజులు వచ్చేశాయా? ఇక చరిత్రలో కలిసిపోవడమేనా?
Kolkata Yello Taxi
KVD Varma
|

Updated on: Jun 29, 2021 | 8:38 PM

Share

Kolkata Yellow Taxi: కోల్‌కతా పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్, రాసగుల్లా, ఫుట్‌బాల్ వీటితో పాటు అక్కడ భయంకర ట్రాఫిక్ లో దూసుకుపోతూ కనిపించే పసుపు టాక్సీలు. అంబాసిడార్ పసుపు టాక్సీలు కోల్‌కతా రోడ్లమీద చాలా ఠీవీగా తిరుగాడటం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కూడా కోల్‌కతా టాక్సీల గురించి చెప్పుకుంటారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు ఈ పసుపు రంగు టాక్సీలు చరిత్ర పుటల్లోకి చేరిపోయే పరిస్థితి వస్తోంది. ఇప్పటికీ కోల్‌కతా నగరంలో అనేక వేల అంబాసిడార్ క్యాబ్ లు తిరుగుతున్నాయి. కానీ, వీటికి యాప్ క్యాబ్ ల దెబ్బ గట్టిగా తగిలింది. దీనితో పాటు కరోనా లాక్‌డౌన్ తోడయ్యి.. ఇక్కడి పసుపు టాక్సీ వాలాల కడుపు కొట్టేశాయి. ఇప్పటికే కరోనా రెండో వేవ్ లో అనేకమంది టాక్సీ డ్రైవర్లు తమ కార్లను అమ్మేసుకున్నారు.

భారతదేశంలో తయారయిన మొదటి కారు అంబాసిడర్. అయితే, దాదాపు ఏడు సంవత్సరాల క్రితం, హిందూస్తాన్ మోటార్స్ దాని ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీ మూసివేసినా కూడా కోల్‌కతా పసుపు టాక్సీలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. బ్రిటీష్ మూలాలు ఉన్నప్పటికీ, అంబాసిడార్ ను భారతీయ కారుగా భావించారు. అదేవిధంగా ప్రేమతో “భారతీయ రహదారుల రాజు” అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల క్రితం, నగరంలో ఓలాస్, ఉబర్స్ లేనప్పుడు, పసుపు టాక్సీ అందరి మొదటి ఎంపిక, కోల్‌కతాకు పర్యాటకులను కూడా ఈ పసుపు కారులు విపరీతంగా ఆకర్షించేవి. మొదటి టాక్సీ కలకత్తాకు 1907 లోనే వచ్చింది. చౌరింగీ సందుల నుండి, మీటర్ టాక్సీ డుమ్డమ్, బరాక్‌పూర్, బడ్జ్ బడ్జెట్‌ఇలా పసుపు టాక్సీలు ప్రజలకు రకరకాల పేర్లతో సేవలు అందిస్తూ వచ్చాయి. స్వాతంత్ర పూర్వం రెండు సిలిండర్లతో కూడిన చిన్న ఎరుపు ‘రథం’ ఇక్కడ టాక్సీగా నడిచేవి. దీనిలో ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే వెళ్ళే చాన్స్ ఉండేది. ఛార్జీ మైలుకు ఎనిమిది అణాలు. బ్రిటీష్ కాలంలో అనేక వ్యాపారాల మాదిరిగానే, కలకత్తా టాక్సీ స్వాతంత్ర్యం తరువాత ఆగిపోయింది. అప్పుడు, 1956 లో, హిందుస్తాన్ మోటార్స్ ఒక అంబాసిడర్ కారును తయారు చేసింది, ఇందులో నలుగురు ప్రయాణీకులతో పాటు సామాను కూడా పట్టే అవకాశం ఉంది. దీనితో ఈ కార్లు కోల్‌కతాలో కొత్త టాక్సీలుగా పరుగులు తీయడం మొదలు పెట్టాయి. కొన్ని సంవత్సరాలతరువాత, ఈ వ్యాపారం ఇండియన్ మోటార్ టాక్సీ క్యాబ్, ఇంజనీరింగ్ కంపెనీగా ప్రసిద్ది చెందింది. అన్ని టాక్సీ నంబర్లు ‘ఎ’ అక్షరంతో ప్రారంభమైనందున ప్రయాణీకులు దీనిని ‘ఎ’ కంపెనీ అని ప్రేమగా పిలిచారు. మాలెన్ స్ట్రీట్‌లోని వారి గ్యారేజీలో 80-90 టాక్సీలు ఉన్నాయి.

మొదట, చాలా మంది డ్రైవర్లు బెంగాలీలు అయినప్పటికీ, తరువాత, ప్రధానంగా సిక్కులు ఈ పనిలో పనిచేస్తున్నారు. ఈ మోడల్ కొన్ని సంవత్సరాలలో ప్రజాదరణ పొందింది. 1962 నాటికి, అంబాసిడర్ ప్రామాణిక టాక్సీ మోడల్ గా నిలిచింది. ఈ అంబాసిడర్ టాక్సీలు మొదట నలుపు,పసుపు లేదా కేవలం పసుపు రంగులో ఉండేవి. బ్లాక్ టాక్సీలు నగరంలో ప్రయాణించగా, పసుపు టాక్సీ ఇంటర్-సిటీలో ప్రయాణించేది. నల్ల కార్లు నెమ్మదిగా అదృశ్యమైనప్పటికీ, పసుపు టాక్సీలు ఇప్పటివరకూ నగరంలో సేవలు అందిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు పసుపు టాక్సీ కూడా తన ప్రయాణాన్ని ఆపేసే దారిలో ఉంది.

ఇప్పుడు ఇక పసుపు టాక్సీ కోల్‌కతాలో సేవలు ఎక్కువ రోజులు అందించకపోవచ్చు. ఎందుకంటే, అంబాసిడార్ కార్లు ఉత్పత్తి లేకపోవడం.. ఓలా..ఊబర్ సంస్థల తాకిడి ఈ రెండిటినీ మించిన కరోనా లాక్ డౌన్ ల ప్రభావం..కొన్ని సంవత్సరాల తరువాత, బహుశా, కోల్‌కతాలోని పసుపు టాక్సీ ప్రయాణం చరిత్ర పుటలలో ఎక్కిపోయే అవకాశం ఉంది.

Also Read: Union Cabinet Expansion:తుది దశకు కేంద్ర కేబినెట్ విస్తరణ.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని భేటీ.. మంత్రుల పనితీరుపై సమీక్ష

Ahmedabad Hit And Run Case : కార్ల రేసులో నలిగిన ప్రాణం.. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మహిళ మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు..