మీ కీబోర్డ్ పై F, J పై ఉండే మార్కును గమనించారా..? అది ఎందుకో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..

|

Mar 16, 2023 | 5:55 PM

కీబోర్డు అందరూ వాడినప్పటికీ ఆ చిన్న గుర్తును మాత్రం చాలా వరకు విస్మరిస్తుంటారు. ఆ గుర్తుల వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉందని తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. 

మీ కీబోర్డ్ పై F, J పై ఉండే మార్కును గమనించారా..? అది ఎందుకో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..
Keyboard 1
Follow us on

ఏళ్ల తరబడి కీబోర్డులు వాడుతున్నాం.. వాడని వారు కూడా కనీసం చూసే ఉంటారు.. కంప్యూటర్ల రాకతో మనందరికీ జీవితాల్లో అనేక పనులను చాలా సులభతరం చేసింది. అయితే, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌ల వైపు మొగ్గు చూపుతారు. అయితే మీరు ఎప్పుడైనా కీబోర్డ్‌లో ఒక విషయాన్ని గమనించారా? కీ బోర్డుపై ఉన్న అక్షరాల్లో ఎఫ్ ఇంకా జె అక్షరాలను ఒకసారి పరిశీలించినట్టయితే.. F, J కీలపై కొంతమంది మాత్రమే గమనించగలిగిన గుర్తులు ఉంటాయి. కీబోర్డు అందరూ వాడినప్పటికీ ఆ చిన్న గుర్తును మాత్రం చాలా వరకు విస్మరిస్తుంటారు. ఆ గుర్తుల వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉందని తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

కంప్యూటర్ కీబోర్డ్‌లలోని F, J కీలపై కనిపించే గుర్తులు, చారలు వినియోగదారులు వారి ఎడమ, కుడి చేతులను పెట్టుకోవటానికి సహాయపడేలా నిర్మాణం చేశారు. మీరు మీ ఎడమ వేలిని Fపై, మీ కుడి వేలిని Jపై ఉంచిన తర్వాత, మిగిలిన కీబోర్డ్‌ను యాక్సెస్ చేయడం చాలా సులభం. మీ ఎడమ చేతి A, S, D, Fలను కవర్ చేస్తుంది, అయితే మీ కుడి చేతి వేళ్లు J, K, L, ఆ తర్వాత కీని కవర్ చేస్తుంది. ఈ రెండు బ్రొటనవేళ్లు టైపింగ్ సులభతరం చేస్తూ స్పేస్ బార్‌పై విశ్రాంతి తీసుకుంటాయి.

Keyboard

కీ బార్డ్‌లో మనం ఈ విధంగా టైప్ చేస్తే, టైపింగ్ సులభం అవుతుంది. మనం వేగంగా టైప్ చేయగలుగుతాం. కాబట్టి కీబోర్డ్‌లో ఇచ్చిన ఈ గుర్తుతో మన ఎడమ, కుడి చేతిని సెట్ చేసుకోవచ్చు. కుడి వేలితో సులభంగా త్వరగా టైప్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..