Viral: సంతోషం కోసం వింత..! గుహలో 16 ఏళ్లు ఒంటరి జీవితం..ఆదిమానవుడిలా స్వేచ్ఛగా..

Viral: సంతోషం కోసం వింత..! గుహలో 16 ఏళ్లు ఒంటరి జీవితం..ఆదిమానవుడిలా స్వేచ్ఛగా..

Anil kumar poka

|

Updated on: Mar 16, 2023 | 9:23 PM

ఆధునిక జీవన విధానం, ఉరుకులు పరుగుల జీవితంపై విసుగు పుట్టిన ఓ వ్యక్తి స్వేచ్ఛా జీవితాన్ని వెతుక్కుంటూ గుహలోకి వెళ్లిపోయాడు. మంచి ఉద్యోగం, అయినవాళ్లను వదిలేసి

ఆధునిక జీవన విధానం, ఉరుకులు పరుగుల జీవితంపై విసుగు పుట్టిన ఓ వ్యక్తి స్వేచ్ఛా జీవితాన్ని వెతుక్కుంటూ గుహలోకి వెళ్లిపోయాడు. మంచి ఉద్యోగం, అయినవాళ్లను వదిలేసి 16 ఏళ్లు గుహలో ఒంటరిగా జీవించాడు. అవును అమెరికాకు చెందిన డేనియల్‌ షల్లాబార్జర్‌ అనే వ్యక్తి మొదట అందరిలాగే సామాన్య జీవితం గడిపాడు. అద్దెఇల్లు, మంచి జీతం.. అయితే ఇలా కష్టపడి డబ్బు సంపాదించడం, అద్దె చెల్లించడం, మళ్లీ కష్టపడి సంపాదించడం ఖర్చుచేయడం .. ఇదంతా అతనికి నచ్చలేదు. వీటన్నిటినీ వదిలి స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు. ఉద్యోగం వదిలేశాడు. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బును పబ్లిక్‌ టెలీఫోన్‌ బూత్‌లో టెలీఫోన్‌ బాక్స్‌పైన పెట్టేసి, యుటా రాష్ట్రంలోని మోఅబ్‌ పట్టణానికి దగ్గర్లోని ఓ గుహలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతనికి ఎంతో స్వేచ్ఛ లభించినట్లు, పెను భారాన్ని వదిలించుకున్న అనుభూతి కలిగింది. అలా 16 ఏళ్లు ఒంటరిగా గుహలోనే ఉండిపోయాడు. ఈ 16 ఏళ్లూ చెత్త డబ్బాల్లో దొరికి ఆహారం తెచ్చుకుని తినేవాడు. మాంసాహారం తినాలనిపించినప్పుడు రోడ్డుపై చచ్చి పడిన జంతువులను తెచ్చి వండుకుని తినేవాడు. తానుండే గుహ దగ్గర కూరగాయలను పండించి ఉపయోగించుకునేవాడు. సాధారణంగా బిచ్చగాళ్లను, నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఫుడ్‌ స్టాంప్స్‌ ఇస్తుంది. వాటిని వినియోగించుకొని ఆహార కేంద్రాల్లో తినవచ్చు. డేనియల్‌ వాటిని కూడా ఉపయోగించుకోలేదు. అందరూ డబ్బు లేకుంటే తిండి ఎలాగని ఆలోచిస్తారు. కానీ, తనకు సులభంగా తిండి దొరికేదని డేనియల్‌ తెలిపాడు. ప్రజలు చాలా ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారని, దాంతో కడుపు నింపుకొన్న తాను ఏ రోజూ జబ్బు పడలేదన్నాడు. 90వ దశకం నుంచే తాను గుహల్లో ఉండటం అలవాటు చేసుకున్నానని, డబ్బు సంపాదించి ఖర్చుచేయడం తనకు నచ్చేలేదని, అందుకే ప్రకృతివైపు నడిచి, ఆదిమానవుల్లా జీవితం గడిపానని తెలిపాడు. ఆధునిక జీవన విధానం తనకు మానసిక ఒత్తిడిని పెంచిందని, ఇప్పడు స్వేచ్ఛగా ఉన్నానని చెప్పాడు. ఇలా సంతోషంగా జీవనం సాగిస్తున్న డేనియల్‌ 2016లో మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. తన తల్లిదండ్రులు వయోవృద్ధులు కావడంతో వారి బాగోగులు చూసుకునేందుకు తాను ఎంచుకున్న జీవన విధానాన్ని వదులుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 16, 2023 09:23 PM