డిసెంబర్‌ 23న ‘కిసాన్‌ దివాస్‌’ ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుకున్న చరిత్ర ఏంటి..?

Kisan Diwas 2021: భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23ని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అవిశ్రాంతంగా పని చేస్తున్న

డిసెంబర్‌ 23న 'కిసాన్‌ దివాస్‌' ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుకున్న చరిత్ర ఏంటి..?
Kisan Diwas 2021
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2021 | 6:59 AM

Kisan Diwas 2021: భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23ని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అవిశ్రాంతంగా పని చేస్తున్న అన్నదాతలకు దేశం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కిసాన్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం, రైతుల సమస్యలు, వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు, నూతన సాంకేతికత, పంటల విధానం, సాగులో మార్పులు వంటి అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది.

భారతదేశం వ్యవసాయ దేశంగా చెబుతారు. నేటికీ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం లేదా అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. డిసెంబర్ 23 దేశ ఐదో ప్రధాని, అనుభవజ్ఞుడైన రైతు చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు. అన్నదాతల ప్రయోజనాల కోసం, వ్యవసాయం కోసం అతను అనేక ముఖ్యమైన పనులు చేసాడు. దేశ ప్రధానిగా ఉన్న చౌదరి చరణ్ సింగ్ రైతులు, వ్యవసాయ రంగ అభ్యున్నతిలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

దేశంలోనే ప్రముఖ రైతు నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషికి 2001లో భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున కిసాన్ దివస్‌గా జరుపుకుంటారు. రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని రైతు కుటుంబంలో డిసెంబర్ 23, 1902 న జన్మించిన చౌదరి చరణ్ సింగ్ గాంధీచే చాలా ప్రభావితమయ్యాడు.

దేశం బానిసగా ఉన్నప్పుడు అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. స్వాతంత్య్రానంతరం రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయడం ప్రారంభించారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ రెండు పర్యాయాలు ఆయన పదవీ కాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇదిలావుండగా ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో ప్రధాన భూమిక పోషించి రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఎనలేని కృషి చేశారు.

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..

సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..