Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Offers: ఉద్యోగం కోసం యువకుడు వినూత్న ప్రయత్నం.. మూడు గంటల్లో మ్యాటర్ క్లియర్.. అవాక్కైన జనాలు..!

Job Offers: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉపాధిపై పెను ప్రభావం చూపింది. నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పతరం కానిదనాలి.

Job Offers: ఉద్యోగం కోసం యువకుడు వినూత్న ప్రయత్నం.. మూడు గంటల్లో మ్యాటర్ క్లియర్.. అవాక్కైన జనాలు..!
Job
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 28, 2021 | 6:35 AM

Job Offers: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉపాధిపై పెను ప్రభావం చూపింది. నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పతరం కానిదనాలి. నిరుద్యోగులు ఇప్పటికీ నిరుద్యోగులు గానే మిగిలిపోయారు. జాబ్స్‌ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి వారు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు చేయని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో చాలా మంది విజయం సాధించారు. అదే సమయంలో ఇప్పటి వరకు ఉద్యోగం తిరిగి పొందలేకపోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందడంలో ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించిన వ్యక్తి కథ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లండన్‌లోని 24 ఏళ్ల హైదర్ మాలిక్ జూమ్ కాల్స్ ద్వారా చాలా కంపెనీలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎందులోనూ సక్సెస్ అవలేదు. దాంతో హైదర్ సరికొత్తగా ఆలోచించాడు. ఉద్యోగం కోసం పూర్తి భిన్నమైన మార్గంతో ముందుకు వచ్చాడు. హైదర్ ఉద్యోగం పొందడానికి సరికొత్త ప్రయత్నం చేశాడు. ఒక స్టేషనరీ దుకాణం నుండి బోర్డ్‌ను కొనుగోలు చేశాడు. దానిపై QR కోడ్‌ను అతికించాడు. తద్వారా ఇతరులు అతని CV, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను సులభంగా చూడగలరు. యాక్సెస్ చేయగలరు.

ప్రయోగం ఇలా సక్సెస్.. మెట్రో స్టేషన్‌లో ఉద్యోగం కోసం ప్లకార్డును ప్రదర్శించాడు. అది గమనించిన కొందరు అతన్ని ఇంటర్వ్యూ చేశారు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే అతనికి ఉద్యోగం లభించింది. కాగా, చిన్నతనంలోనే పాకిస్తాన్ నుండి బ్రిటన్‌కు వెళ్లిన రిటైర్డ్ క్యాబ్ డ్రైవర్, తన తండ్రి మహమూద్ మాలిక్ నుండి తాను ప్రేరణ పొందానని మాలిక్ చెప్పాడు. ఈ విధంగా ఉద్యోగం వెతుక్కోవాలనే ఆలోచన అతని తండ్రికి కూడా వచ్చిందట. ‘‘ఖాళీ చేతులతో నిలబడి ఉన్నందున మొదట నేను కొంచెం భయపడ్డాను. నా బ్యాగ్‌లో CV కాపీ ఉంది. నేను దానిని తీసివేసి, నవ్వుతూ ప్రయాణిస్తున్న ప్రజలకు శుభోదయం చెప్పడం ప్రారంభించాను. ఇంతలో నా ప్రయత్నం చూసి చాలా మంది నవ్వుకున్నారు. అయితే, కొందరు మాత్రం తమ ఫోన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. చివరికి ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో తన ఫోటోను పోస్ట్ చేయడంతో ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఉదయం 7 గంటలకు స్టేషన్‌కు చేరుకున్నాను 9.30 గంటలకు కానరీ వార్ఫ్ గ్రూప్‌లో ట్రెజరీ అనలిస్ట్‌గా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి పిలుస్తున్నట్లు నాకు సందేశం వచ్చింది. నేను సమయానికి అక్కడికి చేరుకున్నాను. ఇంటర్వ్యూ సక్సెస్ అవడంతో ఉద్యోగం దొరికింది.’’ అని హైదర్ సంతోషం వ్యక్తం చేశాడు.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?