Railway Rules: రైల్వేలో మిడిల్ బెర్త్ ప్రయాణమా..? అయితే కొంచెం ఈ రూల్ కూడా తెలుసుకోండి.. లేదంటే భారీ ఫైన్ తప్పదు..

|

May 14, 2023 | 6:20 AM

Indian Railway Rules: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు సీటు విషయంలో ఇబ్బందిలేకుండా తప్పనిసరిగా స్లీపర్ సెక్షన్‌లో రిజర్వేషన్ చేసుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో చాలా మంది లోయర్ బెర్త్,..

Railway Rules: రైల్వేలో మిడిల్ బెర్త్ ప్రయాణమా..? అయితే కొంచెం ఈ రూల్ కూడా తెలుసుకోండి.. లేదంటే భారీ ఫైన్ తప్పదు..
Middle Berth Rule
Follow us on

Indian Railway Rules: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు సీటు విషయంలో ఇబ్బందిలేకుండా తప్పనిసరిగా స్లీపర్ సెక్షన్‌లో రిజర్వేషన్ చేసుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో చాలా మంది లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్ లేదా సైడ్ బెర్త్‌లను బుక్ చేసుకోవడానికే ఇష్టపడుతుంటారు. కానీ మిడిల్ బెర్త్‌పై ఆసక్తి చూపరు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అవును, మిడిల్ బెర్త్‌కి సంబంధించి రైల్వే రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ కారణంగానే చాలా మంది తప్పని పరిస్థితిలో తప్ప మిడిల్ బెర్త్ ప్రయాణంపై ఆసక్తి చూపరు.

మిడిల్ బెర్త్ రూల్ ఏమిటంటే.. 

రైలులో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, పై బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ సమయం అంటే పగటి పూట మిడిల్ బెర్త్‌ పాసింజర్ పడుకోలేరు లేదా కూర్చోలేరు. ఎందుకంటే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మిడిల్ బెర్త్ పాసింజర్ తన బెర్త్‌పై రాత్రి 10:00 గంటలకు ముందు, అలగే ఉదయం 6:00 గంటల తర్వాత నిద్రించకూడదు. ఇంకా సదరు పాసింజర్ రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు మాత్రమే మిడిల్ బెర్‌పై పడుకోవడానికి తనకు అనుమతి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు పగటిపూట అలసిపోయి నిద్రపోవాలనుకున్నా కూడా రాత్రి 10 గంటల వరకు రైలులో కూర్చునే ఉండాలి. ఒకవేళ రైల్వే ఈ నియమాన్ని పాటించకపోతే ఆ సీటులో పడుకున్నవారిపై రైల్వే శాఖ చర్యలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..