Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆక్సిజన్ స్థాయి 40కి పడిపోయింది.. అయినా ఆమె బతికింది..! వైద్యులు అద్భుతం చేశారు.. ఎంటో తెలుసుకోండి..

Doctors Save Woman Life : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఆక్సిజన్ స్థాయి 40కి పడిపోయింది.. అయినా ఆమె బతికింది..! వైద్యులు అద్భుతం చేశారు.. ఎంటో తెలుసుకోండి..
Woman Save Life
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2021 | 6:51 PM

Doctors Save Woman Life : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వేలాది మంది మరణిస్తున్నారు. వీటన్నిటి మధ్య ఒక వార్త వెలువడింది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆక్సిజన్ స్థాయి 40 కి చేరుకుంది. అయినా ఆమె బతికింది. జార్ఖండ్‌లోని రాంచీ మార్కెట్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ కరోనాకు గురైంది. ఆ మహిళ పాజిటివ్‌గా మారినప్పుడు మామూలుగానే ఉంది. కానీ రోజులు గడిచిన కొద్ది ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. వెంటనే మహిళను రాంచీలోని సదర్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక మహిళ పరిస్థితి మీరు ఊహించవచ్చు. ఆమె ఆక్సిజన్ స్థాయి 40 కి పడిపోయింది. ఇక మరణం నుంచి తప్పించుకోవడం అసంభవం అని తేలింది. కానీ వైద్యులు ఆ మహిళ గురించి పెద్ద రిస్క్ చేసి ఆమె జీవితాన్ని కాపాడారు.

ఆమెను వెంటిలెటర్‌పై మార్చినా కూడా ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. తరువాత వైద్యులు మహిళను కాపాడటానికి నోటి ద్వారా ఒక ట్యూబ్ పెట్టి, ఇన్వాసివ్ వెంటిలేటర్ మీద ఉంచారు. ఈ పద్ధతి చాలా కష్టం. ఈ పద్ధతి ఆసుపత్రిలో ఎవరిపైనా ప్రయోగించలేదు. కానీ ఇదే మహిళ ప్రాణాలను కాపాడింది. వైద్యుల ఈ ప్రయత్నం వల్ల మహిళ ఆక్సిజన్ స్థాయి నేరుగా 40 నుంచి 93 కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మహిళ చికిత్స పొందుతోంది ప్రమాదం నుంచి బయటపడింది.

Tv9

Tv9

పెళ్లి చేసుకోవాలంటే వధూవరులకు కోవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.. లేదంటే కఠనమైన చర్యలు.. ఎక్కడంటే..

Waiter Murder for Chicken: చికెన్‌ లేదన్నందుకు వెయిటర్‌ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు

CoviSelf corona test: ఇంటి వద్దే కోవిడ్‌ పరీక్ష.. 5 నిమిషాల్లోనే ఫలితం.. అందుబాటులోకి మైలాబ్ కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్

Corona: ఒక్క ఔషధంతో కరోనా ఖతం!! కేవలం 5 రోజుల్లోనే.! పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..