AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu: ఈ వస్తువులు చేజారితే అశుభం.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

ముఖ్యంగా భారతీయులు మరీ ఎక్కువగా వాస్తును విశ్విసిస్తుంటారు. ఇలా ప్రజలు నమ్మే విశ్వాసాల్లో చేతి నుంచి కొన్ని వస్తువులు జారి పడితే అశుభంగా భావిస్తుంటారు. తెలియకుండా అప్పుడప్పు కొన్ని వస్తువులు చేతి నుంచి జారిపడిపోతుంటాయి. అయితే కొన్నింటి వల్ల.. జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఆ అశుభాలు ఏంటంటే...

Vastu: ఈ వస్తువులు చేజారితే అశుభం.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
Vastu
Narender Vaitla
|

Updated on: Dec 07, 2023 | 3:31 PM

Share

వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు అశుభానికి సూచికగా నిలస్తుంటాయని వాస్తు పండితులు చెబుతుంటారు. అయితే వీటిని మూడ నమ్మకాలు అని కొట్టి పడేసే వారు కొందరైతే, విశ్వసించే వారు మరికొందరు ఉంటారు.

ముఖ్యంగా భారతీయులు మరీ ఎక్కువగా వాస్తును విశ్విసిస్తుంటారు. ఇలా ప్రజలు నమ్మే విశ్వాసాల్లో చేతి నుంచి కొన్ని వస్తువులు జారి పడితే అశుభంగా భావిస్తుంటారు. తెలియకుండా అప్పుడప్పు కొన్ని వస్తువులు చేతి నుంచి జారిపడిపోతుంటాయి. అయితే కొన్నింటి వల్ల.. జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఆ అశుభాలు ఏంటంటే…

* చేతిలో నుంచి పాలు కింద జారిపడితే మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా జరిగితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిదే అయినా ఇంట్లో ప్రతీ రోజూ పాలు పొందిపోతే మాత్రం.. మంచిది కాదని చెబుతున్నారు.

* ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చేతి నుంచి ఉప్పు చేజారి పోకూడదు. ఇలా జరిగితే వచ్చే రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి. ఉప్పు చేజారితే ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* బియ్యం, గోధుమలు కూడా చేజారిపోకూడదు. ఇలా జరిగే వచ్చే రోజుల్లో ఆహార కోరత తప్పదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆహార పాత్రలు పట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

* ఇక చేతి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నల్ల మిరియాలు పడిపోకుండా చూసుకోవాలి. ఇలా జరిగితే రానున్న రోజుల్లో మీ సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొన్ని వాస్తు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించనవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..