What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన అమలు చేసినప్పటి నుంచి దానిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ యాప్‏కు బదులుగా వేరే యాప్‏లను

What's App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 6:53 AM

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన అమలు చేసినప్పటి నుంచి దానిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ యాప్‏కు బదులుగా వేరే యాప్‏లను వెతికెపనిలో పడ్డారు. ఇక గత కొద్ది రోజులుగా ఇక వాట్సప్‏కు ధీటుగా వినిపిస్తున్న పేరు సిగ్నల్ యాప్. వాట్సప్‏ను అన్ ఇన్‏స్టాల్ చేసి తమ ఫోన్లలో సిగ్నల్ యాప్‏ను ఇన్‏స్టాల్ చేసుకుంటున్నారుు. ఇక వాట్సప్ ప్రైవసీ పాలసీని అగ్రీ చేయకపోతే ఫిబ్రవరి 8 నుంచి పనిచేయదు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అలర్ట్స్ యూజర్లందరికి నోటిఫికేషన్ల ద్వారా వస్తునే ఉన్నాయి.

ఇక వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధన వలన వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందరూ సిగ్నల్ యాప్‏కు మారిపోతున్నారు. కానీ వాట్సప్ గ్రూపులు, కాంటాక్టులను సిగ్నల్ యాప్‏కు లింక్ చేసుకోవడం ఎలా ? అలాగే అకౌంట్లోని గ్రూపులు, యూజర్ ప్రొఫైల్స్ ఎలా మైగ్రేట్ చేసుకోవాలి అనేది అందిరిలో కలిగే సందేహాలు. ఈ క్రమంలోనే వాట్సప్ గ్రూపులు, కాంటాక్టులను మార్చుకునేందుకు సిగ్నల్ యాప్ కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది. ప్రతీసారి గ్రూపులో చేరిన ఒక్కో యూజర్‏ను యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఒకేసారి ఎక్కువ మంది వాట్సప్ గ్రూపు యూజర్లను సిగ్నల్ యాప్‏లోకి మర్చుకోవచ్చు.

☞ ముందుగా ప్లే స్టోర్ నుంచి సిగ్నల్ యాప్‏ను డౌన్‏లోడ్ చేసుకోవాలి. ☞ ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ద్వారా సిగ్నల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ☞ ఇందులో కొత్త గ్రూపు క్రియేట్ చేసి దానికి ఒక పేరు అసైన్ చేయాలి. ☞ ఇందులో గ్రూపుకు ఫోటో కూడా యాడ్ చేయొచ్చు. ☞ గ్రూపులోని ఏదైనా ఒక కాంటాక్ట్ నంబర్ మ్యానివుల్‏గా యాడ్ చేయండి. ☞ గ్రూపు సెట్టింగ్స్‏లోకి వెళ్ళి.. group link టర్న్ ఆన్ చేయాలి. ☞ Share ఆప్షన్ పై Tap చేసి.. వాట్సప్ గ్రూపులకు లింగ్ షేర్ చేయాలి. ☞ ఏ వాట్సప్ గ్రూపు ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ గ్రూపుకు Invite link షేర్ చేయాలి. ☞ ఇతర ఏదైనా వాట్సప్ కాంటాక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ☞ ఇక వాట్సప్ గ్రూపులోని యూజర్లు ఈ లింక్ ద్వారా సిగ్నల్ గ్రూపులోకి యాడ్ కావొచ్చు.

Also Read: What’s App : తమ ఉద్యోగులను ఆ మెసేజ్ యాప్ వాడొద్దంటున్న కంపెనీలు.. అసలు కారణం ఇదే..

What’s App Privacy Policy: ఆ వార్తలన్ని అవాస్తవం.. మీ డేటా భద్రతకు మేం రక్షణ.. క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

Latest Articles
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!