AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్ లవర్స్ కి అలర్ట్.. ఈ తప్పులు చేస్తే మీ డాగ్ కి డేంజర్..!

పెంపుడు కుక్కలను చూసుకోవడం అనేది కేవలం ప్రేమతో కూడుకున్న పని కాదు.. బాధ్యతతో కూడిన పని కూడా. వాటికి చక్కగా వండిన ఆహారం పెట్టి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినా.. కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తే అవి వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

పెట్ లవర్స్ కి అలర్ట్.. ఈ తప్పులు చేస్తే మీ డాగ్ కి డేంజర్..!
Dog Care
Prashanthi V
|

Updated on: Jul 29, 2025 | 6:24 PM

Share

పెంపుడు కుక్కలను చూసుకోవడంలో మనం చాలా శ్రద్ధ పెడతాం. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటాం. ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని విషయాల్లో మనకు సరైన అవగాహన లేకపోతే.. అవి మన కుక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి ముఖ్యమైన నాలుగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెటర్నరీ విజిట్ మస్ట్

మీ పెంపుడు కుక్క ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటిని క్రమం తప్పకుండా వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. జబ్బు వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ ను కలవడం సరైన పద్ధతి కాదు. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కుక్కలకు లీష్

లీష్ వాడకపోతే కుక్కలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అవసరం లేనంత బిగుతుగా లీష్ వేస్తే అవి అసౌకర్యంగా ఫీలవుతాయి. వాటికి స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇవ్వడం ద్వారా అవి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాయి. లీష్ వాడటం కేవలం భద్రత కోసం మాత్రమే కాదు.. అవి సంతోషంగా ఉండేందుకు కూడా ఇది అవసరం.

మానసిక ఆరోగ్యం

కుక్కల శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. వాటి మానసిక స్థితి కూడా అంతే ముఖ్యం. వాటిని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడం, సరిగా ఆడుకోకపోవడం లాంటివి.. వాటికి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వాటికి ప్రేమ, సమయం, మానసిక ఉత్తేజం ఇవ్వడం అవసరం.

పెట్ సేఫ్టీ

ఇంట్లో పెంచే కొన్ని మొక్కలు మనకు అందంగా కనిపించినా.. అవి జంతువులకు ప్రమాదకరమైనవి కావచ్చు. కొన్ని రకాల పువ్వులు, ఆకులు కుక్కలు తింటే విష ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నప్పుడు.. మీ గార్డెన్‌ లో ఉన్న మొక్కలు వాటి ఆరోగ్యానికి హాని కలిగించవని నిర్ధారించుకోవాలి.

పెంపుడు జంతువులు మన కుటుంబ సభ్యులతో సమానం. వాటి శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల పూర్తిగా బాధ్యతగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు కూడా వాటి జీవితంపై చెడు ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రేమతో పాటు అవగాహన కూడా పెంపుడు కుక్కలను చూసుకోవడంలో చాలా ముఖ్యం.

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?