Ration Card Download: రేషన్ కార్డును తీసుకోవాలని అనుకుంటున్నారా.. ఈ విధంగా మీరు రెండు నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

|

Jun 16, 2021 | 4:23 PM

How to Download Ration Card: 'వన్ నేషన్.. వన్ కార్డ్' వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అమలు తెచ్చింది. దీని ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ పొందవచ్చు. మీకు రేషన్ కార్డు లేకపోతే..ఆన్‌లైన్‌ ద్వారా మీరు సులభంగా రేషన్ కార్డును ఎలా పొందవచ్చో ఇప్పుడు చూడండి..

Ration Card Download: రేషన్ కార్డును తీసుకోవాలని అనుకుంటున్నారా.. ఈ విధంగా మీరు రెండు నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
how to download ration card
Follow us on

ఆధార్, పాన్ కార్డు మాదిరిగానే, రేషన్ కార్డు కూడా దేశ పౌరులకు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఈ కార్డు సహాయంతో ప్రభుత్వం అందించే నిత్యవసర వస్తువులు సామాన్య ప్రజలకు అందుతున్నాయి. మరోవైపు, ఇది ఒక గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. ఇప్పటికే కేంద్రం ‘వన్ నేషన్ వన్ కార్డ్’ వ్యవస్థను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం లభిస్తోంది.

మీకు ఇంకా రేషన్ కార్డ్ లేకపోతే, మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు (Apply online for ration card). ఇందుకోసం వెబ్‌సైట్‌ను అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. మీరు ఆయా రాష్ట్రం వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక వ్యక్తి తన రేషన్ కార్డును ఏ కారణం చేతనైనా పొందలేకపోతే.. అతను దానిని ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ విషయంలో కూడా ఇదే జరిగితే మీరు మీ రేషన్ కార్డును అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ఏ రాష్ట్రానికి చెందినవారైనా.. రేషన్ కార్డును ఒకే ప్లాట్‌ఫాం నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు ఇతర రాష్ట్రంలో నివసిస్తుంటే మీరు మీ రేషన్ కార్డును వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్లాట్‌ఫామ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ రేషన్ కార్డు ద్వారా  రేషన్ తీసుకోవచ్చు.  రేషన్ కార్డులో ఎవరి పేర్లు నమోదు చేశారో కూడా తెలియక పోచ్చు.. అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్ ద్వారా రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయవచ్చో …  దాని ప్రక్రియ ఏమిటో మీరు తెలుసుకోండి…

రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసే విధానం ఏమిటి?

  • ఆన్‌లైన్ ద్వారా మీ రేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మొదట అధికారిక వెబ్‌సైట్ nfsa.gov.in కు వెళ్లండి.
  • ఈ వెబ్‌సైట్‌లో ముందుగా హోమ్ పేజీ పైన రేషన్ కార్డుల ఎంపికను చేసుకోండి. దీనిలో మీరు రెండు ఎంపికలు కనిపిస్తాయి.
  • మొదటి ఎంపిక ‘వ్యూ రేషన్ కార్డ్ – డాష్‌బోర్డ్’…  రెండవ ఎంపిక ‘రేషన్ కార్డ్ వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్’. దీనిలో మీరు రెండవ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, అన్ని రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి.  మీరు దానిలో మీ రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు.
  • మీ రాష్ట్రాన్ని ఎంచుకున్న తరువాత మీ జిల్లాను ఎన్నుకోమని అడుగుతుంది.
  • జిల్లాను ఎంచుకున్న తరువాత.. మీరు మీ జిల్లా యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన డేటా కనిపిస్తుంది. దీనిలో మీరు మీ గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలను ఎన్నుకోవాలి.
  • మీ ఎంపిక తరువాత మీ బ్లాక్, తహసీల్, గ్రామం లేదా వార్డు గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది.
  • దీని తరువాత చిరునామాను ఎన్నుకోండి.  మీరు మీ గ్రామం లేదా ప్రాంతం యొక్క అన్ని రేషన్ కార్డు వివరాలు కనిపిస్తాయి.
  •   ఇక్కడ మీరు మీ రేషన్ కార్డును ఎంచుకోవాలి.
  • దీని తరువాత మీరు మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇందులో ఫోటో, చిరునామా, సంఖ్య లేదా కుటుంబ సభ్యుల పేరు ఉంటాయి.
  • ఇక్కడ ప్రింట్ చేయడానికి ఒక ఎంపిక ఉంటుంది. దాని నుండి మీరు రేషన్ కార్డును ప్రింట్ చేయవచ్చు.

 ఇలా మీరు మీ రేషన్ కార్డును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..