Iron Cleaning: మీ ఐరన్ బాక్స్ కూడా ఇలా మురికిగా మారిందా.. ఈ చిట్కాలతో చిటికెలో సూపర్ క్లీన్..

మనం మార్కెట్ నుంచి కొనప్పుడు దాని అడుగు భాగం మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దాని మెరుపు తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఎక్కువ

Iron Cleaning: మీ ఐరన్ బాక్స్ కూడా ఇలా మురికిగా మారిందా.. ఈ చిట్కాలతో చిటికెలో సూపర్ క్లీన్..
Iron Press

Updated on: Sep 14, 2022 | 7:38 PM

ఇంట్లో ఎలక్ట్రిక్ ఐరన్‌ బాక్స్‌ని ఉపయోగించనివారు మనలో ఎవరూ ఉండరు. దీని ద్వారా బట్టలు సులభంగా ప్రెస్(ఇస్త్రీ పెట్టె) అవుతాయి. మనం మార్కెట్ నుంచి కొనప్పుడు దాని అడుగు భాగం మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దాని మెరుపు తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఎక్కువ హీట్‌ అయినప్పుడు బట్టలు కాలిపోతుంటాయి. దీంతో ఐరన్ బాక్స్‌కు అంటుకునే మరక అలానే ఉండిపోతుంది. దీని కారణంగా, బట్టలు ప్రెస్ చేసినప్పుడు సమస్యగా మారుతుంది. ఈ మరకలు చాలా మొండిగా ఉంటాయి. వాటిని వదిలించుకోవటం చాలా కష్టమవుతుంది. ఎలా క్లీన్ చేసినా దానికి అంటుకున్న మరక అలానే ఉంటుంది. అయితే ఎంతకు వదలని మరకను వదలించడం ఎలానో తెలుసుకుందాం .

పవర్ ఐరన్ బాక్స్‌పై(ఇస్త్రీ పెట్టె) మరకలను ఎలా తొలగించాలి..

1. బేకింగ్ సోడా

క్లీనింగ్ లక్షణాలు బేకింగ్ సోడాలో ఉంటాయి. ఇది చాలా వస్తువులను శుభ్రం చేస్తుంది. ఐరెన్ బాక్స్‌ను శుభ్రం చేయడానికి.. 2 టీస్పూన్ల సోడాలో కొద్దిగా నీరు కలపడం ద్వారా పేస్ట్‌ను రెడీ చేసుకోండి. ఈ పేస్ట్‌ని చెంచా సహాయంతో ఐరన్‌పై అప్లై చేసి, కొంత సమయం తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ వేడి చేసిన తర్వాత, ఏదైనా ఉపయోగించని క్లాత్‌ను ప్రెస్ చేయండి. మీరు కోరుకున్నట్లుగా శుభ్రం అవుతుంది.

2. పారాసెటమాల్ ఉపయోగించండి..

పారాసెటమాల్ అనేది ఒక మెడిసిన్. మనకు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకుంటాం.అయితే దీని సహాయంతో మనం దానికి ఉన్న మురికిని వదలిచవచ్చు. మొదట ఐరన్ బాక్స్‌ను వేడి చేయండి. తర్వాత మందపాటి గుడ్డ సహాయంతో పారాసిటమాల్ టాబ్లెట్‌ను ఐరన్‌పై రుద్దండి. ఆ తర్వాత మరో గుడ్డతో శుభ్రం చేయండి. ఇప్పుడు గుర్తు కనిపించకుండా పోయే వరకు ఇలానే చేయండి.

3. ఉప్పు, సున్నం

ఒక గిన్నెలో ఉప్పు, సున్నం సమానంగా తీసుకోండి. ఆ తరువాత ఆ మిశ్రమానికి నీటిని కలపండి. ఇలా పెస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్‌ను మరకపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచిన తర్వాత శుభ్రమైన గుడ్డతో శుభ్రం చేయండి. ఇది మొండి తుప్పును కూడా తొలగిస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం