Anakapalle: పిట్ట కొంచెం, కూత ఘనం.. 5 ఏళ్ల వయస్సుకే గుర్రపు స్వారీలో ఆరితేరిన చిచ్చరపిడుగు

పిట్ట కొంచెం, కూత ఘనం సామెతకు ఈ బుడ్డోడు పక్కా యాప్ట్ అని చెప్పవచ్చు. తన టాలెంట్ ఏంటో చూపిస్తూ లోకల్ సెలబ్రిటీగా మారిపోయాడు ఈ చిన్నోడు.

Anakapalle: పిట్ట కొంచెం, కూత ఘనం.. 5 ఏళ్ల వయస్సుకే గుర్రపు స్వారీలో ఆరితేరిన చిచ్చరపిడుగు
Boy Horse Riding
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 4:09 PM

AP News: జీవితమే ఒక ఆట సాహసమే పూబాట అంటూ గుర్రపు స్వారీ( Horse riding )లో దుమ్మురేపుతున్నాడు ఓ చిచ్చరపిడుగు. పిట్ట కొంచెం, కూత ఘనం సామెతకు ఈ బుడ్డోడు పక్కా యాప్ట్ అని చెప్పవచ్చు. తన టాలెంట్ ఏంటో చూపిస్తూ లోకల్ సెలబ్రిటీగా మారిపోయాడు. మెరుపు వేగంతో గుర్రపు స్వారీ చేస్తూ  ‘ఈ చిన్నోడు చాకు రా’ అనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ బయటపెట్టేందుకు సమయం, సందర్భం రావాలి. కొందరు యవస్సు అంతా అయిపోతున్నా తమ టాలెంట్ బయటపెట్టేందుకు జంకుతారు. భయంతో వెనకడుకు వేస్తారు. అయితే తిమ్మాపురం గ్రామానికి చెందిన చిచ్చరపిడుగు చిన్న వయసులోనే అద్భుత సాహసం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. బొత్తిగా మాటల రాని వయస్సులోనే గుర్రపు నాడా పట్టుకున్నాడు. గుర్రం సకిలింపు అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు చల్‌చల్‌ అంటూ స్వారీ చేస్తుంటాడు. ఐదేళ్ళ వయస్సు వచ్చేసరికే ఈ బుడ్డోడు గుర్రపు స్వారీలో అన్ని మెళకువలు నేర్చుకున్నాడు. గుర్రంపై సూపర్ హీరోలా దూసుకుపోతూ.. వారెవ్వా అనిపిస్తున్నాడు.

అనకాపల్లి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన జోషిత్ ఛత్రపతికి కేవలం ఐదేళ్లే. ఇతను చిన్నప్పటి నుంచి మగధీర సినిమా పెడితే తప్ప అన్నం తినేవాడు కాదు.  ఏ పని చేస్తున్నా సరే మగధీర మూవీ పెట్టాలని మారాం చేసేవాడు. ఆ స్ఫూర్తితోనే బుడ్డోడికి గుర్రపు స్వారీపై ఇంట్రస్ట్ ఏర్పడింది. దీంతో పేరెంట్స్ కూడా అతని అభిరుచికి తగ్గట్లుగా… ప్రోత్సహించారు. 3 సంవత్సరాలు నుంచే చిచ్చరపిడుగు జోషిత్ హార్స్‌ రైడింగ్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు గుర్రపు స్వారీలో ఆరితేరాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి