రోడ్లపై ఉండే మైలురాళ్లకు వేర్వేరు కలర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

మన దేశంలోని రోడ్లపై ప్రయాణించేప్పుడు మనం చేరాల్సి గమ్యం ఇంకా ఎన్ని కిలోమీటర్ల ఉందో సూచించేందుకు రోడ్డు పక్కన కొన్ని మైల్‌రాళ్లు ఉండడం మీరు చూసేఉంటారు. అయితే అవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క కలర్స్‌లో ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా.. దీని గురించి చాలా మందికి అస్సలు తెలిసి ఉండదు.. అయితే వాటి ఇలా వేర్వేరు కలర్స్‌ ఎందుకుంటాయో ఇప్పుడు మనం తెలసుకుందాం.

రోడ్లపై ఉండే మైలురాళ్లకు వేర్వేరు కలర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?
Milestone Colors

Edited By: Ram Naramaneni

Updated on: Aug 15, 2025 | 5:57 PM

మన దేశంలోని రోడ్లపై ప్రయాణించేప్పుడు మనం చేరాల్సి గమ్యం ఇంకా ఎన్ని కిలోమీటర్ల ఉందో సూచించేందుకు రోడ్డు పక్కన కొన్ని మైల్‌రాళ్లు ఉండడం మీరు చూసేఉంటారు. అయితే అవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క కలర్స్‌లో ఉంటాయి. కొన్ని దగ్గర ఎల్లో అండ్ వైట్, గ్రీన్ అండ్ వైట్, బ్లూ లేదా బ్లాక్ అండ్ వైట్ ఇలా అనేక రకాలు ఉంటాయి. అయితే ఇలా ఉండే వాటిలో ఒక్కో కలర్‌కు ఒక్కొ అర్థం ఉంటుందట. ఆ మైలురాయి కలర్‌ను బట్టి మనం ఆ రహదారి గురించి తెలుసుకోవచ్చట. అయితే ఏ రంగు ఏ రహదారి గురించి తెలియజేస్తుందనేది పరిశీలిస్తే..

పైన పసుపు, కింద తెలుపు రంగు ఉన్న మైలుళ్లు నేషనల్ హైవేలను సూచిస్తాయి. రోడ్డుపై ఈ రంగు రాళ్లు కనిపిస్తే అది నేషనల్‌ హైవే అని అర్థం. ఇవి దేశంలోని రాష్ట్రాల, ప్రధాన నగరాలను కలిపే రోడ్లుపై ఉంటాయి. హైవేలపై వేగంగా వెళ్లే వాహనాలు వీటిని ఈజీగా గుర్తించేందు ఈ రంగులను ఉపయోగిస్తారు. ఈ జాతీయ రహదారులను నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది.

ఇంకొకటి పైన గ్రీన్‌, కింద వైట్‌ రంగు ఉండే మైలురాళ్లు స్టేట్ హైవేలను సూచిస్తాయి. మనకు ఈ రాళ్లు ఎక్కడైనా కనిపిస్తే అది స్టేస్‌ హైవే అని అర్థం. ఇవి చాలా వరకు మనకు రాష్ట్రంలో ఉన్న నగరాలు, పట్టణాలను కలిపే రహదారులపై కనిపిస్తాయి. ఈ స్టేస్‌ హైవేస్‌ను ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు మెయంటేన్‌ చేస్తాయి.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.