Beauty Tips: ఐబ్రోస్‌ థ్రెడింగ్‌తో కలిగే నొప్పిని తట్టుకోలకపోతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..

Beauty Tips: ఇటీవల పార్లర్‌కు వెళ్లే మహిళల సంఖ్య పెరుగుతోంది. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి అందరూ పార్లర్‌ బాటపడుతున్నారు. ఇక అందమైన కనుబొమ్మలను మరింత అందంగా మార్చుకోవడానికి..

Beauty Tips: ఐబ్రోస్‌ థ్రెడింగ్‌తో కలిగే నొప్పిని తట్టుకోలకపోతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..
Beauty Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2021 | 2:02 PM

Beauty Tips: ఇటీవల పార్లర్‌కు వెళ్లే మహిళల సంఖ్య పెరుగుతోంది. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి అందరూ పార్లర్‌ బాటపడుతున్నారు. ఇక అందమైన కనుబొమ్మలను మరింత అందంగా మార్చుకోవడానికి ఐబ్రోస్‌ థ్రెడింగ్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం పట్టణాలకే పరిమితమైన ఈ కల్చర్‌ ఇప్పుడు గ్రామాలకు కూడా వ్యాపించింది. దీంతో ఏ చిన్న శుభకార్యక్రమం ఉన్నా వెంటనే ఐబ్రోస్‌ థ్రెడింగ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుందని మనందరికీ తెలిసిందే.. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుంది. అయితే కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

* ప్రస్తుతం చలికాలం కారణంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారుతాయి. ఇలాంటి సమయంలో థ్రెడింగ్ చేయడం వల్ల భరించలేని నొప్పి కలుగుతుంది. కాబట్టి థ్రెడింగ్‌ చేసుకునే ముందు ఐస్‌ క్యూబ్‌తో కను బొమ్మల చుట్టూ ఉన్న ప్రదేశంలో కొద్ది సేపటి వరకు రుద్దాలి. ఇలా చేయడం వల్ల థ్రెడింగ్‌ చేసే సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

* ఐస్‌క్యూబ్‌తో మసాజ్‌ చేయడం వల్ల చర్మం కూడా స్పర్శను కోల్పోతుంది. కాబట్టి థ్రెడింగ్‌కు ముందు 4 నుంచి 5నిమిషాల పాటు ఐస్‌తో మసాజ్‌ చేసి థ్రెడింగ్‌ చేస్తే నొప్పి ఉండదు.

* థ్రెడింగ్ చేసే సమయంలో కనుబొమ్మలను కదలకుండా పట్టుకోవాలి. ఇలా వదులుగా ఉండకుండా థ్రెడింగ్ చేస్తే కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

* థ్రెడింగ్ చేస్తున్న సమయంలో చూయింగ్ గమ్‌ నమిలినా మంచి ఫలితం ఉంటుంది. చూయింగ్‌ గమ్‌ను నోట్లో వేసుకొని వేగంగా నమలాలి ఇలా చేయడం వల్ల కూడా నొప్పి భావన తగ్గుతుంది.

* టాల్కమ్‌ పౌడర్‌ ద్వారా కూడా నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇందు కోసం ముందుగా కనుబొమ్మలపై టాల్కమ్‌ పౌడర్‌ను చల్లాలి. పూర్తి స్థాయిలో టాల్కమ్‌ పౌడర్‌ను అప్లై చేసిన తర్వాత థ్రెడింగ్‌ చేస్తే నొప్పి కలగదు. ఇలాంటి సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఇకపై థ్రెడింగ్ చేసే సమయంలో భరించలేని నొప్పిని పొందకుండా.. సింపుల్‌గా పని పూర్తి చేసుకోవచ్చన్నమాట.

Also Read: UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్సీ.. అర్హులు ఎవరంటే..

Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..

Survival Game: అత్యంత చల్లనైన ప్రదేశంలో మనుగడ కోసం స్కేట్‌బోర్డింగ్ ప్రాక్టీస్.. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?