ఇంట్లో దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి రావు..
అలాగే, దోమలు కొన్ని రకాల సువాసనలకు దూరంగా వెళ్లిపోతుంటాయి. అలాంటి వాటిల్లో తులసి, వెల్లుల్లి, వేప నూనె, లవంగాలు, నిమ్మకాయ, ఉల్లిపాయ, ఆపిల్ సిడార్ వెనిగర్, యూకలిప్టస్ ఆయిల్, లావెండర్, పుదీనా వంటి సువాసనలకు దూరంగా పారిపోతాయి. దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే మూలల్లో తరిగిన ఉల్లిపాయలను ఉంచటం వల్ల

వర్షా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో తరచూ దోమలు కుడితే అనేక ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. దీంతో చాలా మంది దోమల నివారణ కోసం రకరకాల మస్కిటో రిపెల్లెంట్లు, కాయిల్స్ వంటివి వాడుతుంటారు. ఇలాంటి కెమికల్ ఆధారిత నివారణలతో లేనిపోని అనారోగ్య సమస్యలను కొనితెచ్చున్నట్టే అవుతుంది. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ఫాలో అయితే దోమల బెడద నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. పైగా ఇలాంటి సహజ సిద్ధ చిట్కాలు పాటించటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దోమల నివారణ కోసం ఉపయోగించే మస్కిటో రిపెల్లెంట్లను శరీరానికి అప్లై చేసుకోండి. కొనే ముందు బాగా రీసెర్చ్ చేయండి. ఉదయం- సాయంత్రం వేళ లాంగ్ స్లీవ్స్ షర్టులు, ప్యాంటులు, సాక్స్‌లు వేసుకోవటం ఉత్తమం. అలాగే, మస్కిటో నెట్లు కొనుక్కుని బెడ్ రూమ్‌లో పెట్టుకోవటం ఉత్తమం. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సిట్రోనెల్ల, లావెండర్, మారిగోల్డ్ వంటి మస్కిటో రెపెల్లెంట్ ప్లాంట్లను ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. దాంతో పాటుగా ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి మడుగు, నీటి నిల్వలు ఉండకూండా చూసుకోవాలి. దోమల బెడద ఎక్కువగా ఉన్న చోట ఫ్యాన్లు పెట్టుకోవాలి. దీంతో దోమలు మీ వరకు చేరలేవు.
అలాగే, దోమలు కొన్ని రకాల సువాసనలకు దూరంగా వెళ్లిపోతుంటాయి. అలాంటి వాటిల్లో తులసి, వెల్లుల్లి, వేప నూనె, లవంగాలు, నిమ్మకాయ, ఉల్లిపాయ, ఆపిల్ సిడార్ వెనిగర్, యూకలిప్టస్ ఆయిల్, లావెండర్, పుదీనా వంటి సువాసనలకు దూరంగా పారిపోతాయి. దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే మూలల్లో తరిగిన ఉల్లిపాయలను ఉంచటం వల్ల ఆ ఘాటైన వాసనకు దోమలు, ఈగలు ఆ దరిదాపుల్లో కనిపించవు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




