Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netbanking Frauds: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ లింక్ పైన క్లిక్ చేయకండి.. చేస్తే మీ ఖాతా ఖాళీ..!

ఆన్‌లైన్ మోసాల కేసులు విపరీతమైన కారణంగా చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటున్నాయి. తాజాగా దేశంలో..

Netbanking Frauds: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ లింక్ పైన క్లిక్ చేయకండి.. చేస్తే మీ ఖాతా ఖాళీ..!
Cyber Security Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 09, 2023 | 7:41 PM

పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలలో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య  కూడా భారీగానే పెరిగింది. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాల కేసులు కూడా విపరీతమయ్యాయి. ఈ కారణంగానే చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద కార్పోరేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేసింది. కొంతకాలంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పాన్ కార్డ్ అప్‌డేట్, కేవైసీ వంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్‌లపై స్పందించిన బ్యాంక్ ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లని స్పష్టం చేయడంతో పాటు వాటిపై క్లిక్ చేయకండని కూడా కోరింది. అలాంటి మెసేజ్‌లపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఇటువంటి మెసేజ్‌లు రాకుండా.. లేదా వచ్చినా మీ ఖాతాకు ఎలాంటి సమస్య లేకుండా ఉండేందుకు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరి.

సైబర్ మోసాలను అరికట్టేందుకు పాటించాల్సిన చిట్కాలివే..

1. ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిన లింక్ యుఆర్‌ఎల్‌ని పూర్తిగా తనిఖీ చేయండి.

2. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

ఇవి కూడా చదవండి

3. నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేస్తున్న పేజీలో తప్పనిసరిగా https:// ఉండాలి. ఇందులో s అంటే సెక్యూరిటీ అని అర్థం. ఇది https://తో ప్రారంభం కాకపోతే సమాచారాన్ని నమోదు చేసే ముందు జాగ్రత్త వహించాలి.

4. ఏదైనా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని నంబర్‌ను క్రాస్ చెక్ చేయండి.

5. మీ కంప్యూటర్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి.

6. ఎల్లప్పుడూ మీ క్రెడిట్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేస్తూ ఉండండి.

7. ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా పాన్ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ సలహా ఇవ్వదని గుర్తుంచుకోండి.

8. ఏదైనా కాల్ లేదా మెసేజ్‌పై అనుమానం ఉంటే, వెంటనే బ్యాంక్‌కి కాల్ చేయడం ద్వారా క్రాస్ వెరిఫై చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి