Vidura Neeti: ఈ చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకుంటే సంపదతో సంతోషంగా బతకొచ్చు
విదురుడి మాటల్లో చెప్పబడిన నీతి మన జీవితం సాఫీగా సాగేందుకు మార్గదర్శకం. ధనం, బుద్ధి, ధర్మం ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పబడింది. ఈ నీతి పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ప్రతి మనిషి జీవితంలో అవసరమైన విలువలు, ఆచరణలు ఇందులో పొందుపరచబడ్డాయి.

విదుర నీతి మనిషి జీవనశైలి, నడవడి, ఆలోచనలు ఎలా ఉండాలన్న విషయాలను స్పష్టంగా వివరిస్తుంది. మంచి బుద్ధి, నైతికత, ధర్మబద్ధమైన జీవితం ఎలా ఉండాలో దీనిలో చెప్పబడింది. ఈ నీతి సూచనలను పాటిస్తే మనిషి ధర్మమార్గంలో నడిచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలడు. ఈ నీతి ద్వారా జీవితపు అసలైన విలువలు తెలుసుకోవచ్చు.
విదురుడు చెప్పినట్టు.. లక్ష్మీదేవి అనుగ్రహం మంచి పనుల వల్ల లభిస్తుంది. ఎవరు మంచిగా ప్రవర్తిస్తారో, బుద్ధిగా ఉంటారో వారిని లక్ష్మీదేవి ప్రసన్నంగా ఆశీర్వదిస్తుంది. మన ఆలోచనలు, పనులు సద్గుణాలతో ఉండాలి. చెడు ఆలోచనలు, దురాశ, దుర్మార్గాలు మనకు ధనాన్ని దూరం చేస్తాయి.
విదురుడి మాటల్లో.. సోమరితనం మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది. ఎవరు వృథాగా సమయం గడుపుతారో వాళ్లు లక్ష్మీదేవి దృష్టికి దూరమవుతారు. కష్టపడేవారికి విజయం దగ్గరలో ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక మంచి పని చేయాలి. శ్రమించేవారే ధనం సంపాదిస్తారు.
డబ్బు సంపాదించడం సరిపోదు. దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవడంలోనే తెలివి ఉంది. విదురుడి చెప్పినట్టు సంపద ఉండాలంటే ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరమైన చోటే ఖర్చు చేయాలి. వృథా ఖర్చులు చేస్తే సంపద శాశ్వతంగా ఉండదు. ఎవరైతే ఆదా చేస్తారో వారింట్లో ఎప్పుడూ ధనం ఉంటుంది.
భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించాలి. డబ్బు ఎలా వాడాలో నిర్ణయించాలి. విదురుడు చెబుతున్నట్టు ఈ రోజు నుంచే ఆర్థిక ప్రణాళిక మొదలుపెట్టాలి. ప్రతీ నెల ఖర్చులను గమనిస్తూ దానికి అనుగుణంగా సేవింగ్ చేయాలి. ఈ అలవాటు వల్ల ఆపద సమయంలో కష్టాలు ఎదురవ్వవు.
డబ్బును తెలివిగా వాడాలి. అవసరం లేని వస్తువుల మీద ఖర్చు చేయకూడదు. అవసరానికి తగ్గట్టుగా, బుద్ధిగా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుంది. డబ్బు విలువను అర్థం చేసుకున్న వారికి ధనం నిలుస్తుంది. విదురుడు చెప్పిన మాటల్ని అనుసరిస్తే మనం ధనవంతులు కావచ్చు.
విదురుడు చెప్పిన నీతి మాటలు మన జీవితంలో మార్పు తేవచ్చు. మంచి స్వభావం, కృషి, ఖర్చుపై నియంత్రణ ఉంటే ధనం మన ఇంట్లో నిలుస్తుంది. ఈ చిన్న విషయాలు గుర్తుంచుకుంటే మనం శాంతిగా, సంపదతో జీవించవచ్చు.




