AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushya Nakshatra: అద్భుతమైన రోజు 677 ఏళ్ల తర్వాత.. ఆ రోజు పట్టిందల్లా బంగారమే.. అదిరిపోయే అదృష్టం మీ కోసం..!

Pushya Nakshatra: చాలా మంది ఏదైనా వస్తులులు కొనుగోలు చేయాలంటే ఆ రోజు మంచి రోజు ఉందా లేదా అని చూసే ఆనవాయితీ భారతీయులకు చాలా ఉంటుంది..

Pushya Nakshatra: అద్భుతమైన రోజు 677 ఏళ్ల తర్వాత.. ఆ రోజు పట్టిందల్లా బంగారమే.. అదిరిపోయే అదృష్టం మీ కోసం..!
Pushya Nakshatra
Subhash Goud
|

Updated on: Oct 26, 2021 | 8:38 AM

Share

Pushya Nakshatra: చాలా మంది ఏదైనా వస్తులులు కొనుగోలు చేయాలంటే ఆ రోజు మంచి రోజు ఉందా లేదా అని చూసే ఆనవాయితీ భారతీయులకు చాలా ఉంటుంది. ఇక బంగారు ఆభరణాలు, వాహనాలు, భూములు, ఇల్లు.. ఇలా ఏది కొనుగోలు చేయాలన్నా సాధారణంగా ఒకటి పదిసార్లు మంచి రోజు ఎప్పుడు ఉందో అని చూసుకుంటారు. మంచి రోజు కొనడం వల్ల అంతా శుభమే జరుగుతుందనే చాలా మందికి నమ్మకం. ఇటువంటి కార్యక్రమాలకు పుష్య నక్షత్రంకు ఎంతో ప్రాముఖ్య ఉంది. చాలా మంది ఏవైనా ఆస్తులు లేదా నూతన వాహనాలు, బంగారం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలన్నా పుష్య నక్షత్రం కోసమే ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాదిలో ఒక రోజు పుష్య నక్షత్రం వస్తున్నప్పటికీ ఈ సంవత్సరం దీనికి ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అనేది జ్యోతిషులు వివరిస్తున్నారు.

పుష్య నక్షత్రానికి ప్రాముఖ్యత ఏమిటి..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా శుభదినాన మంచి పనులు చేపట్టడం, లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తుంటారు. పవిత్రమైన సమయంలో నిర్వహించే పనులు ఎటువంటి ఆటంకాలకు గురికావని బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఏడాదిలో ఒకసారి వచ్చే పుష్య నక్షత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించాలన్నా.. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది దీపావళికి ముందు అంటే అక్టోబర్ 28న వచ్చే పుష్య నక్షత్రం అనేక విధాలుగా చాలా శుభప్రదమైనదని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. అక్టోబర్ 28న గురువారం కావడం, అదే రోజున పుష్య నక్షత్రం వస్తుండటం వల్ల ఆ రోజును మరింత శుభప్రదమైనదిగా పేర్కొంటున్నారు జ్యోతిష నిపుణులు. అక్టోబర్ 28న పగలు, రాత్రి అంతా పుష్య నక్షత్రం ఉంటుందని.. ఆ రోజు గురువారం కావడంతో గురు పుష్య యోగం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రోజు ఏర్పడ్డ అమృత సిద్ధి యోగం మరోసటి రోజు ఉదయం అంటే.. అక్టోబర్ 29 ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగుతుందని అంటున్నారు. అంతే కాదండోయ్‌..677 ఏళ్ల క్రితం అంటే 1344లో ఏర్పడ్డ గ్రహస్థితులే ఈ ఏడాది అక్టోబర్ 28న కూడా ఏర్పడనున్నాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!