Dogs: పెంపుడు కుక్కలను పెంచుకుంటే పన్ను చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం
శునకాలకు, మనుషులకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కుక్కలను పెంచుకునే ట్రెండ్ బాగా పెరుగుతోంది. అయితే శునకాలను పెంచుకునే వారి నుంచి కొన్ని దేశాలు పన్నులను వసూలు చేస్తాయని మీకు తెలుసా.? ఈ పన్నుల ద్వారా ఓ దేశ ప్రభుత్వం ఏకంగా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది..
మనుషులు, కుక్కల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వందల ఏళ్ల నుంచి కుక్కలు మనుషులు కలిసి జీవిస్తున్నాయి. అత్యంత విశ్వాసం ఉన్న జంతువుగా భావించే శునకాలను పెంచుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. విదేశాల్లో ఈ ట్రెండ్ కొన్ని వందల ఏళ్ల నుంచే అమల్లో ఉంటే ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ ఎక్కువవుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో కచ్చితంగా శునకాలను పెంచుకుంటారు.
శునకాలకు, మనుషులకు మధ్య ఉండే ఎమోషన్ బాండ్ కూడా అలాంటిదేనని చెప్పాలి. అయితే భారత్‌లో శునకాలను పెంచుకోవడానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో శునకాలను పెంచుకోవాలంటే ప్రభుత్వాలకు కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. కొన్ని దేశాలకు ఈ పన్నుల రూపంలో వేల కోట్లు ఆదాయం వస్తుందంటే మీరు నమ్ముతారా.? కానీ నిజం ఇంతకీ ఏయే దేశాల్లో ఈ పన్ను వసూలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
జర్మనీ ప్రజలు శునకాలను పెంచుకోవాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ పన్నును స్థానిక భాషలో ‘హుండెష్టోయర్’గా పిలుస్తారు. అయితే ప్రభుత్వం పన్ను విధిస్తున్నా జర్మనీలో కుక్కలను పెంచుకునే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. ప్రజలు కుక్కలను పెంచడం ద్వారా జర్మన్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. ఓ అంచనా ప్రకారం 2023లో కుక్కల యజమానుల నుంచి జర్మన్ ప్రభుత్వం వసూలు చేసిన పన్ను దాదాపు 421 మిలియన్ యూరోలు. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ. 3వేల కోట్లు కావడం గమనార్హం. 2013, 2023 మధ్య డాగ్ కీపింగ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 41 శాతం పెరిగింది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..