Watch: ఇదో వింత ఆచారం.. పిల్లల్ని ఇలా ఆవుపేడలో దొర్లిస్తే ఆరోగ్యంగా ఉంటారట..! ఎక్కడంటే..

ఆ ఇంద్రుడి కోపం నుండి గ్వాల్ రాజవంశాన్ని రక్షించడానికి కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అప్పటి నుండి, గోవర్ధన్ మహారాజ్‌ను గ్వాల్ వంశస్తూ పూజిస్తూ వస్తున్నారు. గోవర్ధన్ మహారాజ్‌ని ఆరాధించడం ద్వారా, గోవుల సంపద వృద్ధి చెందుతుంది, తమ పశువుల, పిల్లా పాపాలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. వారికి ఎటువంటి విపత్తులు సంభవించవని నమ్ముతారు.

Watch: ఇదో వింత ఆచారం.. పిల్లల్ని ఇలా ఆవుపేడలో దొర్లిస్తే ఆరోగ్యంగా ఉంటారట..! ఎక్కడంటే..
Govardhana Puja
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 02, 2024 | 6:43 PM

దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దీపావళి వేడుకలు నిర్వహించారు ప్రజలు. దీపావళి రెండవ రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధన్ పూజ చేయటం ఆనవాయితీ. అయితే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో గావ్లీ సంఘం చేసే గోవర్ధన్ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గావ్లీ కమ్యూనిటీ ప్రజలు పశువుల కాపరులతోపాటు, తల్లి ఆవుపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటారు. పడ్వా రోజున గోవర్ధనుడి బొమ్మను మహిళలు ఆవు పేడతో తయారు చేస్తారు. ఆ ప్రతిమకు 56 రకాలైన నైవేద్యాలు సమర్పించి గోవర్ధనుని పూజిస్తారు. పూజ అనంతరం వారు నిర్వహించే మరో వినూత్న కార్యక్రమం అందరినీ ఆశ్చర్యపోయేలా ఉంటుంది. అదేంటంటే…

దీపావళి రెండో రోజున షాజాపూర్‌లోని గావ్లీ సంఘం వేల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ గోవర్థన పూజ చేస్తారు. ఇందుకోసం బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి శుచిగా స్నానం చేస్తారు. అనంతరం ఆవు పేడను తీసుకొచ్చి దానితో గోవర్థన పర్వతంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహాన్ని తయారు చేస్తారు.. ఆ విగ్రహాన్ని పూలు, రంగులతో అలంకరిస్తారు..ఇక పూజ కోసం ప్రత్యేకించి ఖీర్-పూరీతో సహా 56 రకాల ప్రసాదాలను సమర్పించి గోవర్ధన్ పూజను పూర్తి చేశారు. అనంతరం వారి పిల్లలు గో పేడలో పొర్లించటం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఒక చోట కుప్పపోసిన పేడలో చిన్నారుల్ని దొర్లించి తమ పిల్లలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకుంటారు. ఇలా చేస్తే వారు ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం. ఈ సంప్రదాయాన్ని గావ్లీ సంఘం అనేక తరాలుగా అనుసరిస్తోంది. ఈ పూజా విధానం వెనుక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

విశ్వాసాల ప్రకారం, ఆ ఇంద్రుడి కోపం నుండి గ్వాల్ రాజవంశాన్ని రక్షించడానికి కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అప్పటి నుండి, గోవర్ధన్ మహారాజ్‌ను గ్వాల్ వంశస్తూ పూజిస్తూ వస్తున్నారు. గోవర్ధన్ మహారాజ్‌ని ఆరాధించడం ద్వారా, గోవుల సంపద వృద్ధి చెందుతుంది, తమ పశువుల, పిల్లా పాపాలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. వారికి ఎటువంటి విపత్తులు సంభవించవని నమ్ముతారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..