Delhi: అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

Delhi: అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2024 | 7:34 PM

ఎవడన్న కోపంగా కొడతాడు.. బలంగ కొడతాడు.. కని వీడెంట్రా.. చాలా శ్రద్దగా కొట్టాడు.. ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు.. చాలా జాగ్రత్తగా పద్దతిగా కొట్టాడు.. అని అతడు సీన్మల ఒక డైలాగుంటది సూడు.. సేమ్ అట్లనే శాన పద్దతిగ కాళ్లకు మొక్క మడ్డర్ చేశిర్రుల్లా గా ఢిల్లీల నిన్న.. ఈనడ్మ నేరాలు, ఘోరాలు చేశేటోల్లుగూడ పద్దతులు ఫాలో అయితున్నరుగదా.

ఎవడన్న కోపంగా కొడతాడు.. బలంగ కొడతాడు.. కని వీడెంట్రా.. చాలా శ్రద్దగా కొట్టాడు.. ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు.. చాలా జాగ్రత్తగా పద్దతిగా కొట్టాడు.. అని అతడు సీన్మల ఒక డైలాగుంటది సూడు.. సేమ్ అట్లనే శాన పద్దతిగ కాళ్లకు మొక్క మడ్డర్ చేశిర్రుల్లా గా ఢిల్లీల నిన్న..

ఈనడ్మ నేరాలు, ఘోరాలు చేశేటోల్లుగూడ పద్దతులు ఫాలో అయితున్నరుగదా. గుల్లె దొంగతనం చేశే ముంగట మొక్క దొంగతనాలు చేస్తున్నరు దొంగోల్లుగూడ.. అట్లనే మడ్డర్ చేశే ముంగట కాళ్లు మొక్కి మరీ చేశిండు గీ ఢిల్లీల ఒకడు.. ఇగొ..

ఇంటిముంగట పటాకులు కాల్చుకుంట పండుగ సంబురంల మునిగిర్రు గీ ముగ్గురు.. ఇంతల్నే బండిమీద ఇద్దరొచ్చిర్రు.. అండ్లకడు దిగి ఇటుకేయ్ నిలవడ్తె.. ఇంకోడు పెద్దాయ్న కాళ్లకు మొక్కినట్టు చేశిండు.. అటెన్క సూడు ఏంజేశిర్రో..

కతం.. తుపాకి తీశి తుట్ట తుట్ట కాల్శిపోతుంటె.. ఈ పిలగాడు ఉన్నోడుండక వాల్లను దొర్కవడ్దామని ఎంటవడ్డ పాపానికి.. ఆయ్ననుగూడ కాల్శిర్రట.. అటు లోపటికి వొయ్న ఆకాశ్ అనేటాయ్నకు.. ఆయ్న పదేండ్ల కొడుకుకు తూటాలు తల్గినై.. ఇటు బైట వాల్లను పట్కుందామని వచ్చిన ఆకాశ్ మేనల్లుడు రిషబ్ మీద కాల్పులు జరిపితె.. ఇద్దరు అక్కడిదక్కన్నే జీవిడ్శిర్రు.. ఆకాశ్ కొడ్కు పరిస్థితిగూడ అట్లట్లనే ఉందట పాపం..

అయితె తుపాకితోటి కాల్శినోడు వీళ్లకు బాగ ఎర్కున్నోడేనట.. 70 వేల పంచాదుందంట వీల్లనడ్మ.. ఈ నడ్మ పంచాది ముదిరి.. పగవెంచుకునేదంక వెరిగిందన్నట్టు.. నీ పైసల్ సల్లగుండ.. ఏ పైసల్ర అయ్య.. పైసల్ వోతె మల్ల సంపాయించ్కోవచ్చు.. పానాలు వోతె వస్తయా? అదేమొగనీ.. కాళ్లు మొక్కి మరీ కాల్శి సంపుడే శిత్రమన్పిస్తుంది.. డిల్లీ బీహారీ నగర్ల జరిగిందిట్ల.. ఇంతకు వాని మైండ్ సెట్టేంది, కాన్సెప్టేందో అని ఢిల్లీ పోలీసోల్లకు సమజ్ గాక జుట్టు వీక్కుంటున్నరట..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 02, 2024 07:34 PM