AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు..! రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని

అందుకు ససేమీరా అంగీకరించని దుకాణదారుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాట మాటా పెరిగి గొడవపెద్దదైంది..ఈ క్రమంలోనే ఆ దుకాణం యజమాని సదరు మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది.

మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు..! రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని
Woman's Nose Cut Off Due To
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2024 | 6:45 PM

Share

బీహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 కోసం ఒక దుకాణదారుడు మహిళ ముక్కును నరికాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి పిల్లలు స్థానికంగా ఉన్న దుకాణంలో వారికి కావాల్సినవి ఏవో కొనుగోలు చేశారు. అయితే, వాటికి డబ్బులు చెల్లించలేదు..ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. అందుకు ససేమీరా అంగీకరించని దుకాణదారుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాట మాటా పెరిగి గొడవపెద్దదైంది..ఈ క్రమంలోనే ఆ దుకాణం యజమాని సదరు మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది.

ఈ షాకింగ్‌ ఘటన ని బీహార్‌ అరారియాలోని ఫోర్బ్స్‌గంజ్ బ్లాక్‌లోని వార్డు నంబర్ ఆరులో చోటుచేసుకుంది. హలీమా ఖాతూన్, రోష్ని, సోనీతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులు తన కుమార్తెపై దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తన కుమార్తె ముక్కుకు తీవ్ర గాయమయ్యిదని తెలిపారు.

ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను వేడుకున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..