UPI Lite: యుపీఐ లైట్ వినియోగదారులకు శుభవార్త
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ముఖ్యంగా మనం ఎలాంటి బ్యాంక్ వివరాలు నమోదు చేయకుండానే, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం సహా వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు.
అందుకే తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా యూపీఐ మారిపోయింది. ఈ క్రమంలో యూపీఐకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు కొత్తగా అమల్లోకి వచ్చాయి. నవంబర్ 1 నుండి యూపీఐ లైట్ వినియోగదారులు మరిన్ని చెల్లింపులు చెయ్యవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని కూడా పెంచింది. నవంబర్ 1 తర్వాత మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉంటే, కొత్త ఆటో టాప్-అప్ ఫీచర్ ద్వారా మళ్లీ యూపీఐ లైట్‌కి డబ్బు జోడించవచ్చు. ఇది మాన్యువల్ టాప్-అప్ అవసరాన్ని తొలగిస్తుంది. దీని కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లైట్ సహాయంతో చెల్లింపులను సజావుగా చేయవచ్చు. యూపీఐ లైట్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కొత్త ఫీచర్‌ను ఇటీవలే తీసుకొచ్చింది. అదే యూపీఐ లైట్ ఆటో టాప్-అప్ ఫీచర్. యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి. లిమిట్‌ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: రష్యాలో ప్రభాస్ క్రేజ్.. కల్కీ రీ- రిలీజ్ ఫోటోలు తీసే పేరుతో.. హీరోయిన్ పై దారుణ కామెంట్స్ Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.....
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

