OnePlus 13: మార్కెట్లో వన్‌ప్లస్ 13.. స్పెషిఫికేషన్స్, ధర వివరాలు..!

02 November 2024

Subhash

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 (OnePlus 13)ను గురువారం చైనాలో ఆవిష్కరించింది. 

వన్‌ప్లస్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 

క్వాల్ కామ్ స్నాప్

120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ (1440 x 3168 పిక్సెల్స్) కలిగి ఉంటుంది. 

రీఫ్రెష్ రేటు

4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ట్యూన్డ్ బై హేసిల్ బ్లాడ్ ఉంటుంది. 

పీక్ బ్రైట్‌నెస్‌

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ 15 వర్షన్ పై పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలోకి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 15 తో పని చేస్తుందని వన్ ప్లస్ తెలిపింది.

ఆండ్రాయిడ్ 15

వన్‌ప్లస్ 13 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.53,100 (4499 చైనా యువాన్లు).

వన్‌ప్లస్ 13 ఫోన్

12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.57,900 (4899 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.62,200 (5299 చైనా యువాన్లు).

వేరియంట్

24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.70,900 (5999 చైనా యువాన్ల)లకు లభ్యం అవుతుంది. త్వరలో భారత్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

24 జీబీ ర్యామ్