Papaya Seeds: ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు దివ్యౌషధం
బొప్పాయి గింజల ప్రయోజనం తెలిస్తే వాటిని బంగారం కంటే భద్రంగా దాచేస్తారు. వీటితో క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు అన్ని రోగాలను నయం చేయవచ్చు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ సహా ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే బొప్పాయి గింజలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లు. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫెనాల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడానికి పని చేస్తాయి. బొప్పాయిలోని కెరోటిన్‌లు ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్‌ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. రుతుక్రమాన్ని ఉత్తేజపరిచేందుకు, దాని క్రమాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బొప్పాయి గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఒలేయిక్ యాసిడ్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
బొప్పాయి గింజలను ఎలా తినాలో చూద్దాం. రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను చూర్ణం చేసి పాలు లేదా గంజి వంటి వాటిలో కలిపి తాగవచ్చు. అంతే కాకుండా ఎండబెట్టి పొడి చేసి టీ స్పూన్ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.