Gas Leak Safety Tips: కిచెన్‌లో గ్యాస్ లీక్ అవుతుందేమోనని కంగారు పడకండి.. సిలిండర్ నుంచి మంటలు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే..
గ్యాస్ లీక్ అయినప్పుడు భయాందోళనలకు గురవుతారు. అయితే ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వాస్తవానికి, LPG గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నప్పుడు.. గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ కస్టమర్‌కు గ్యాస్ భద్రతకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. చాలా మంది ఈ భద్రతా నియమాలను పట్టించుకోరు. ఈ అజాగ్రత్త కారణంగా అనేక సార్లు పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీక్‌ల విషయంలో మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను మనం ఇక్కడ తెలుసుకుందాం.

గ్యాస్ స్టవ్‌ను దాదాపు ప్రతి ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు కొంతమంది గ్యాస్ లీక్ అయినప్పుడు భయాందోళనలకు గురవుతారు. అయితే ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వాస్తవానికి, LPG గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నప్పుడు.. గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ కస్టమర్‌కు గ్యాస్ భద్రతకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. చాలా మంది ఈ భద్రతా నియమాలను పట్టించుకోరు. ఈ అజాగ్రత్త కారణంగా అనేక సార్లు పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
గ్యాస్ లీక్‌ల విషయంలో మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్నప్పటికీ, ఈ చిట్కాల సహాయంతో మీరు దానిని నియంత్రించవచ్చు.
గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలి
1. సిలిండర్ స్విచ్ ఆఫ్ చేయండి..
గ్యాస్ నుంచి ఏదైనా వాసన వస్తుంటే ముందుగా గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. గ్యాస్ పెద్ద మొత్తంలో లీక్ అయితే వంటగది, ఇంట్లో ఉన్న అన్ని విద్యుత్ స్విచ్‌లను ఆఫ్ చేయండి. అదే సమయంలో, మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. భయపడకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
2. అక్కడ నుంచి మండే వస్తువులను..
గ్యాస్ వాసన అనిపిస్తే, గ్యాస్ సిలిండర్‌ను ఆపివేసి, గ్యాస్ దగ్గర ఉంచిన అగ్గిపుల్లలు, లైటర్లు, మండే వస్తువులను తీసివేయండి. దీనితో పాటు దీపం, అగరబత్తీ, అగరుబత్తీ లాంటివి ఏవైనా వెలుగుతుంటే ఆర్పివేయండి.
3. ఎలక్ట్రిక్ స్విచ్‌ను తాకవద్దు..
గ్యాస్ వాసన వచ్చినప్పుడు, ఎలక్ట్రిక్ స్విచ్‌ను ఎప్పుడూ తాకవద్దు. స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేయవద్దు. ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా స్విచ్ నుంచి స్పార్క్ పడితే అప్పుడు గ్యాస్ కారణంగా మంటలు వచ్చే అవకాశం ఉంది.
4. తలుపులు, కిటికీలు తెరవండి..
గ్యాస్ లీకేజీ అయితే ఇంటి తలుపులు, కిటికీలు, స్కైలైట్లు అన్నీ తెరవండి. దీంతో గ్యాస్ బయటకు వచ్చి ప్రమాదం జరిగే అవకాశం తగ్గుతుంది.
5. సిలిండర్‌కి మంటలు అంటుకుంటే ఏం చేయాలి..
గ్యాస్ లీక్ వల్ల సిలిండర్‌కు మంటలు వస్తున్నట్లైతే.. ఏదైనా కాటన్ షీట్, దుప్పటి లేదా పెద్ద టవల్‌ని నీటిలో ముంచి సిలిండర్‌కు చుట్టాలి. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. మీ ఇంట్లో ఏదైనా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంటే.. మీరు దానిని కూడా ఉపయోగించవచ్చు.
6. రెగ్యులేటర్ , పైపును తనిఖీ చేస్తూ ఉండండి..
గ్యాస్ లీకేజీ విషయంలో, సిలిండర్ నుంచే గ్యాస్ లీక్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ప్రతిసారీ జరగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు రెగ్యులేటర్, గ్యాస్ పైప్ కూడా గ్యాస్ లీకేజీకి కారణం కావచ్చు. అందువల్ల, ఎప్పటికప్పుడు రెగ్యులేటర్, పైపులను తనిఖీ చేస్తూ ఉండండి. పైపు కొద్దిగా అరిగిపోయినట్లు కనిపిస్తే, వెంటనే మార్చండి.
(నోటు: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది.)
మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం
