ఇవాళ జాతిపిత గాంధీజీ వర్ధంతి.. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడిపై స్పెషల్ స్టోరీ..
20 శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు పోరాడిన నాయకుల్లో గాంధీజీ ఒకరు. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే

20 శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడిన నాయకుల్లో గాంధీజీ ఒకరు. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని సాటి చెప్పారు గాంధీ. సత్యం, అహింస అనేవి తన ఆయుధాలను చెప్పి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల్ల చేతుల్లోంచి.. భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. మహాత్మ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసినట్లు.. కొంత మంది ఇంటి పేరో, ఊరికొక్క వీధి పేరో కాదు గాంధీ. కరెన్సీ నోట్ మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. భరత మాత తల రాతను మార్చిన విధాత గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ.. అన్నట్లుగానే గాంధీజీ జీవితం భారతవనికి ఒక అపురూప చరిత్ర. బానిసలుగా మారిన భారతీయులకు అహింస మార్గాలను చూపి.. స్వదేశం కోసం ఎదురునిలిచేలా చేసిన గాంధీ 73వ వర్ధంతి నేడు. భారతదేశంపై చెరగని ముద్రవేసిన మహానీయుడు గాంధీజీ.. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్ధనా మందిరానికి వెళ్తుండగా.. ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు.
గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్థానంలో ఒక దివాన్‌గా పచేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి. తల్లిదండ్రుల సంరక్షణలోనే గాంధీజీ బాల్యం గడిచింది. తరగతి గదిలో గాంధీ ఇతరుల విద్యార్థుల మాదిరిగా చురుకుగా ఉండేవాడు కాదు. తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలను గాంధీ తన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగం (మై ఎక్స్‌పరిమెంట్ విత్ ట్రుత్)లో స్వయంగా రాసుకొచ్చారు. నేడు గాంధీ 73వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతవని నివాళులు అర్పిస్తుంది. “అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి’–మహాత్మ గాంధీ, అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్లో షేర్ చేశారు.
‘అహింసే అత్యున్నత కర్తవ్యం.మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా,దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి’–మహాత్మ గాంధీ
మహాత్మ గాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/63sfWSeVuw
— Vice President of India (@VPSecretariat) January 30, 2021
Also Read: