Vastu: మీ పిల్లలు చదువులో రాణించాలా.? ఈ వాస్తు చిట్కాలు పాటించండి

ఇక అన్ని గదుల్లో వాస్తు నియమాలను పాటించాలని చెబుతున్నట్లు.. చిన్నారులు చదువుకునే గది విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. చిన్నారులు చదవుల్లో రాణించకపోతున్నా, ఏకాగ్రత లోపిస్తున్నా కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని అంటున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu: మీ పిల్లలు చదువులో రాణించాలా.? ఈ వాస్తు చిట్కాలు పాటించండి
Vastu Tips
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2024 | 8:45 AM

వాస్తును విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటారు. ఇంటిలో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండాలని వాస్తు పండితులు సైతం సూచిస్తుంటారు.

ఇక అన్ని గదుల్లో వాస్తు నియమాలను పాటించాలని చెబుతున్నట్లు.. చిన్నారులు చదువుకునే గది విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. చిన్నారులు చదవుల్లో రాణించకపోతున్నా, ఏకాగ్రత లోపిస్తున్నా కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని అంటున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నారులు ఏకాగ్రతతో చదువుకోవాలనుకుంటే వారికంటూ ప్రత్యేకంగా ఒక స్డడీ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. ఇది కచ్చితంగా తూర్పు లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. స్టడీ రూమ్‌ తూర్పు దిశలో ఉంటే మరీ మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్నారులు చదువుపై ఎక్కు ఏకాగ్రత చూపుతారని పండితులు చెబుతున్నారు.

అలాగే చిన్నారులు చదువుకునే గదిలోకి గాలి, వెలుతురు దారాలంగా వచ్చేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు చదువుపై దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. ఇక స్టడీ రూమ్‌లో గోడలకు గ్రీన్‌, బ్లూ, ఎల్లో కలర్స్‌ను వేసుకుంటే మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక చిన్నారుల స్టడీ టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు చదువుకునే రూమ్‌లో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారిలో ప్రశాంతమైన ఆలోచనలు కలగడానికి సహాయం చేస్తాయని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..