Winter Fog: పొగ మంచు డ్రైవింగ్‌కు ఇబ్బంది పెడుతోందా.? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
మంచు దుప్పటి కారణంగా దేశంలో పలు చోట్ల రైళ్లు, విమానాలు సైతం రద్దవుతున్నాయి. ఇక రోడ్లపై ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు కారణంగా రోడ్లు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మంచు దుప్పటి కారణంగా దేశంలో పలు చోట్ల రైళ్లు, విమానాలు సైతం రద్దవుతున్నాయి. ఇక రోడ్లపై ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు కారణంగా రోడ్లు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
* మంచు కురుస్తున్న సమయంలో వేగాన్ని కచ్చితంగా తగ్గించాలి. మరీ ముఖ్యంగా వాహనాలను ఓవెర్ టేక్ చేయడం లాంటివి చేయకూడదు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఢీకొట్టే అవకాశం ఉంటుంది.
* ఇక మంచు కురుస్తున్న సమయంలో ‘లో బీమ్ హెడ్‌లైట్స్’ను ఉపయోగించాలి. హై బీమ్ హెడ్‌లైట్స్ ఆన్ చేస్తే మంచు తుంపర్లు రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ కారణంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మంచు కురిసే సమయంలో టేల్ లైట్, బ్లింకర్స్‌ను ఉపయోగించడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
* ఇక వాహనాలను డ్రైవింగ్ చేసే సమయంలో స్మార్ట్ ఫోన్ వినియోగం, ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడం లాంటి చేయకూడదు. వీటివల్ల బయటి శబ్ధాలు వినిపించవు. కాబట్టి విండోను కాస్తయినా డౌన్ చేయాలి దీనివల్ల బయట వాహనాల శబ్ధాలు వినిస్తాయి.
* మంచులో రోడ్డు స్పష్టంగా కనిపించదనే విషయం తెలిసిందే. కాబట్టి ఓవర్ టేకింగ్‌లాంటివి చేయకుండా సింగిల్‌లైన్‌కు పరిమితమై డ్రైవింగ్ చేయాలి. తక్కువ వేగంతో ఒకే లైన్‌లో డ్రైవ్ చేస్తూ వెళితే ప్రమాదాలను నివారించవచ్చు.
* మంచులో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉండే వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అవతలి వ్యక్తులు సడెన్ బ్రేక్‌లు వేస్తే, వాహనం కంట్రోల్ కావాలంటే కచ్చితంగా గ్యాప్ ఉండాలి. వాహనాల మధ్య గ్యాప్ ఉండకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
* ఇక వాహనాలకు లైట్ ఇండికేటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రోడ్డు లైన్ మారుతున్న సమయంలో లేదా మలుపులు ఉన్న చోట ఇండికేటర్స్ వేయడం ద్వారా ఇతర వాహనదారులను అలర్ట్ చేయొచ్చు. దీనివల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాలను తగ్గించవచ్చు.
* ఇక మంచు కురుస్తున్న సమయంలో మీ వాహనాలను రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు. రోడ్డు స్పష్టంగా కనిపించని కారణంగా వేగంగా వచ్చే వాహనాలు, ఆగివున్న వాటిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాల్సి వస్తే ఇండికేటర్స్‌ను ఆన్ చేయాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
