
రైతుల విజయ రహస్యం ఏమిటంటే, తక్కువ శ్రమతో ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న పంట. దీనిని ఒకసారి నాటిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఫలాలను ఇస్తుంది. అవును దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రైతులు ఉసిరిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ పంట చాలా లాభదాయకమైన పంటగా అవతరించింది. సారవంతమైన నేల, వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో రైతులు సాంప్రదాయ పంటలకు దూరంగా ఉసిరి తోటలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఒకసారి నాటిన ఉసిరి మొక్క 25 నుండి 30 సంవత్సరాల వరకు ఫలాలను ఇస్తుంది. ఇది రైతులకు దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ మొక్కకు ఎక్కువ నీరు, లేదా ఎక్కువ శ్రమ అవసరం లేదు. ప్రారంభ దశలో దీనికి కొద్దిగా జాగ్రత్త మాత్రమే అవసరం. నీరు నిల్వ ఉండని అన్నిరకాల నేలల్లో ఉసిరి సాగు చేసుకోవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న భూముల్లో కూడ ఈ పంటను సాగుచేయవచ్చు. సోడి యం 30 శాతం వరకు వున్న భూముల్లోనూ ఉసిరిని పండించవచ్చు.
ఈ పంట ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఈ పండ్లకు ఏడాది పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఉసిరితో జ్యూస్, జామ్, స్వీట్స్, ఉసిరి పొడి మొదలైనవి ఆరోగ్యానికి అత్యంత విలువైనవిగా పరిగణిస్తారు. విలువ ఆధారంగా ఉసిరికి డిమాండ్ ఏర్పాడుతుంది. ఇది రైతులకు అదనపు లాభాన్ని అందిస్తుంది.
బిందు సేద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాల సహాయంతో రైతులు తమ ఉసిరి ఉత్పత్తిని పెంచుకుంటున్నారు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక పండ్లు, స్థిరమైన డిమాండ్ కారణంగా ఈ పంట నేడు చాలా మంది రైతులకు ఆదాయ వనరుగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..