Wildlife Facts: నాగుపాము కరిచినా ఈ జీవులకు ఏమీ కాదు.. నమిలి తినేస్తాయి కూడా..!

పాము కాటు వేస్తే ఏ మనిషైనా, జంతువు అయినా.. పక్షి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇలాంటి ఉదంతాలను మనం నిత్యం చాలానే చూస్తున్నాం. అందుకే.. పాములను చూడగానే మనం వణికిపోతాం. పాము అక్కడ ఉండగానే.. ఇక్కడి నుంచి పారిపోతాం. ఎందుకంటే అది విషపూరితమైంది కాబట్టి. కానీ, కొందరు ధైర్యం చేసి దానిని

Wildlife Facts: నాగుపాము కరిచినా ఈ జీవులకు ఏమీ కాదు.. నమిలి తినేస్తాయి కూడా..!
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 06, 2023 | 1:15 AM

పాము కాటు వేస్తే ఏ మనిషైనా, జంతువు అయినా.. పక్షి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇలాంటి ఉదంతాలను మనం నిత్యం చాలానే చూస్తున్నాం. అందుకే.. పాములను చూడగానే మనం వణికిపోతాం. పాము అక్కడ ఉండగానే.. ఇక్కడి నుంచి పారిపోతాం. ఎందుకంటే అది విషపూరితమైంది కాబట్టి. కానీ, కొందరు ధైర్యం చేసి దానిని పట్టుకుంటుంటారు. అదే వేరే మ్యాటర్. అయితే, పాములు కరిస్తే చనిపోవడం పక్కనపెట్టి.. పాములను కరిచి చంపేసే జీవులు ఉన్నాయని మీకు తెలుసా? అవును, అత్యంత విషపూరితమైన పాము కరిచినప్పటికీ.. వాటికి ఏమీ కాకపోగా.. రివర్స్‌ ఆ పాములనే అవి నమిలి మింగేస్తాయి. అలాంటి జీవులు భూమిపై చాలానే ఉన్నాయి. వాస్తవానికి కొన్ని రకాల పాములు కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందే. మరికొన్ని పాములు కాటేస్తే కొన్ని గంటల తరువాత ప్రాణాలు కోల్పోతారు. కానీ, వీటిని ఏ పాము కాటేసినా ఏమీ కాదు. పామును చంపేంత వరకు అవి విశ్రమించవు. మరి పాటు కాటేసినా ఏమీ కాని, పామునే చంపేసి తినే జీవుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.

ఈ భూ ప్రపంచంలో కోట్లాది జీవులు ఉన్నాయి. అందులో వెలుగులోకి వచ్చినవి గుప్పెడంత మాత్రమే. ఇక వెలుగులో ఉన్న జంతువుల్లోనే విభిన్నమైనవి ఉన్నాయి. విషపూరితమైన, ప్రమాదకరమైన జంతుజాలం ఈ భూమిపై చాలానే ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన జీవుల్లో సరసృపాలైన పాములు ఒకటి. ఈ పాముల్లోనూ రకరకాల జాతులు ఉన్నాయి. అయితే, పిల్లికి, ఎలుకకు మధ్య శత్రుత్వం ఎలా ఉంటుందో.. పాములకు కొన్ని శత్రు జీవులు ఉన్నాయి. అవి.. ఈ పాముల పాలిట యమభటుల్లా ఉంటాయి. వాస్తవానికి పాము కాటేస్తే ఏ జీవైనా ప్రాణాలు కోల్పోతుంది. కానీ, ఈ జీవులు కాటేస్తే పాములే చనిపోతాయ. అంతటి శక్తి వీటి సొంతం. వాస్తవానికి పాములలో కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమై పాము. అయినప్పటికీ ఈ పామును ఎదుర్కొనే ఇతర జీవులు కూడా ఉన్నాయి.

1. ముంగిస, పాము బద్ద శత్రువులు. ఇది పాము పాలిట ప్రాణాంతక శత్రువు. అది పోటినివ్వడమే కాకుండా.. పాము ప్రతిదాడిని భరించి.. పామును చంపేసేంత వరకు వెనక్కి తగ్గదు. పామును చంపి, తిన్న తరువాతే దానికి విశ్రాంతి ఉంటుంది. 2. ముంగిస తరువాత పాములతో పోరాడి ఓడించే జీవుల్లో పక్షులు కూడా ఉన్నాయి. ఈగల్స్, ఫాల్కన్లు, గుడ్లగూబలు వంటి పక్షులు కింగ్ కోబ్రాను హింసించి చంపగల శక్తిగలవి. పాముపై విషం చిమ్మేందుకు కూడా ప్రయత్నిస్తుంది. వీటి దాడుల్లో పాములు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. 3. పాము కూడా సరీసృపమే. సరీసృపాలకు దానితో పోరాడే కళ కూడా తెలుసు. పెద్ద బల్లులు, మొసళ్ళు, ఎలిగేటర్లు కూడా పాములను చంపి తినే అవకాశం ఉంటుంది. వాటి పరిమాణం, బలాన్ని ఉపయోగించి పామును చంపి తినేస్తాయి. 4. నక్క, రక్కూన్, వీసెల్ వంటి జంతువులు కూడా పాములకు బద్ధ శత్రువులు. ఇవి కింగ్ కోబ్రాను చంపి, దాని విష ప్రాంతాన్ని తొలగించి మాంసాన్ని తింటాయి. వీటి దంతాలు చాలా పదునైనవిగా ఉంటాయి. ఎలాంటి జీవినైనా ఇట్టే చంపేస్తాయి. 5. ఇవే కాకుండా.. పాములకు పాములే శత్రువుల ఉంటాయి. స్వజాతీ పాములు ఇతర పాములనువ వేటాడుతున్న 6. ఇవే కాకుండా పాములకు పాములు కూడా శత్రువులే. స్వజాతీ సర్పాలు.. ఇతర పాములను వేటాడి, వెంటాడి ఆహారంగా తినేస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..