Vastu Tips: బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను వెంటనే తీసి పడేయండి.. లేదంటే..

వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే కూడా వాస్తు నియమాలను తప్పకపాటించాలని వాస్తు పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా సంతోషంగా గడాపాలంటే బెడ్‌ రూమ్‌లో కొన్ని నియమాలను తప్పక పాటించాలని అంటున్నారు. బెడ్ రూమ్‌లో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు దంపతుల మధ్య దూరాన్ని...

Vastu Tips: బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను వెంటనే తీసి పడేయండి.. లేదంటే..
Bed Room Vastu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2024 | 6:56 PM

వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందువులు వాస్తును కచ్చితంగా పాటిస్తారు. నూటికి 90 శాతం మంది వాస్తు ఆధారంగానే తమ ఇంటిని నిర్మించుకుంటారు. మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతుంటారు.

వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే కూడా వాస్తు నియమాలను తప్పకపాటించాలని వాస్తు పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా సంతోషంగా గడాపాలంటే బెడ్‌ రూమ్‌లో కొన్ని నియమాలను తప్పక పాటించాలని అంటున్నారు. బెడ్ రూమ్‌లో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ బెడ్ రూమ్‌లో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బెడ్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో భోజనానికి ఉపయోగించే ప్లేట్స్‌, గ్లాసులను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బెడ్‌ పై కూర్చొని భోజనం చేయడం అస్సలు మంచిది కాదని అంటున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు. భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీయడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులకు సైతం దారి తీస్తుందని అంటున్నారు.

* ఇక బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు, బూట్లూ ఉండకూడదని నిపుణులు అంటున్నారు. కొందరు మంచం కింద పాత చెప్పులను పెడుతుంటారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగి జంటల మధ్య గొడవలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* అలాగే బెడ్‌ రూమ్‌లో మురికి పాత్రలను అస్సలు ఉంచకూడని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* కొందరు మంచం కింద మొత్తం చెత్తతో నింపేస్తుంటారు. అయితే ఇది కూడా వాస్తు దోషానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది దంపతుల మధ్‌య బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

* మనలో చాలా మంది చీపురును మంచం కింద పెడుతుంటారు. అయితే ఇది కూడా మంచి అలవాటు కాదని చెబుతున్నారు. దీనివల్ల దంపతుల మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఇక బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్‌ పూలను పెట్టుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. అదే విధంగా ముళ్లతో కూడిన మొక్కలను ఏర్పాటు చేసుకున్నా దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..