Sneeze: తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకున్నాడు.. ఆ తర్వాత..

ముక్కులోని చెడు పదార్ధాలను బయటకు పంపే క్రమంలో తుమ్ములు వస్తాయి.. వాటిని ఆపాలనుకోవడం కరెక్ట్ కాదు. శరీర సహజ నిర్మాణానికి వ్యతిరేకంగా మనం చేసే పనులే మనకు సమస్యలు తెచ్చి పెడతాయి. ఇది అలాంటి కేసే.. తుమ్మును ఆపేందుకు.. ఓ వ్యక్తి నోరు, ముక్కు మూసుకున్నాడు. ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు.

Sneeze: తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకున్నాడు.. ఆ తర్వాత..
Hospital Scans
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 07, 2024 | 4:28 PM

తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చేతులు అడ్డుపెట్టుకోవడం అవసరం. లేని పక్షంలో.. తుంపర్లు బయటకు పడతాయి. దాని ద్వారా రోగాలు వ్యాప్తి చెందుతాయి. అయితే కొంతమంది తుమ్ము ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. స్కాట్లండ్‌లో ఓ వ్యక్తి అలా చేయడం వల్ల గొంతులో తీవ్రమైన గాయమైన ఘటన అప్పట్లో వెలుగుచూసింది. తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం వల్ల.. అతని శ్వాసనాళం 2 మిల్లీమీటర్ల మేర చిరిగిపోయింది అని వైద్యులు టెస్టుల్లో నిర్ధారించారు.

అక్కడి డుండీలోని నైన్‌వెల్స్ ఆస్పత్రి 30 ఏళ్ల బాధితుడు విపరీతమైన గొంతు నొప్పితో జాయిన్ అయ్యాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు గొంతులో గాయాన్ని గుర్తించారు. దీంతో ఘటనతో స్కాట్‌లాండ్ మెడికల్ టీమ్ ఒక అలెర్ట్ జారీ చేసింది. తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. శ్వాసనాళం ఎగువ భాగంపై దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఒత్తిడి పడుతుందని డుండీ యూనివర్సిటీ డాక్టర్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెడికల్ జర్నల్ బీఎంజే కేస్ రిపోర్ట్స్‌లో పొందుపరిచారు.

తుమ్మిన సమయంలో బాధితుడు డ్రైవింగ్‌లో చేస్తూ ఉన్నాడు. ఆయనకు గతంలోనూ అలర్జీలు, గొంతు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆపరేషన్ ఏం అవసరం రాలేదు. అనాల్జెసిక్, యాంటీహిస్టామైన్ మెడిసిన్ ఇచ్చి పంపారు. 2 వారాల పాటు వర్కువట్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఐదు వారాల తర్వాత తిరిగి పేషెంట్‌ను రమ్మని చెప్పారు. అప్పుడు మళ్లీ స్కానింగ్ తీయగా.. గొంతులోని గాయం నయం అయినట్లు తేలింది.

ముక్కులోని డస్ట్ వంటి వాటిని బయటకు పంపే క్రమంలో తుమ్ములు వస్తాయని, అవి మన శరీర నిర్వాహణ క్రమంలో భాగమని, వాటిని నిరోధించాలని అనుకోకూడదని డాక్టర్లు చెబతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..