Viral: కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోన్న మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లు.. ఎక్స్‌రే చూడగా..

ఓ మహిళ గత కొన్నేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా..

Viral: కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోన్న మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లు.. ఎక్స్‌రే చూడగా..
Follow us

|

Updated on: Dec 05, 2022 | 8:15 PM

ఓ మహిళ గత కొన్నేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కాన్ చేసిన వాళ్లు.. వచ్చిన ఎక్స్‌రే చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. చివరికి దాన్ని తొలగించి వైద్యులు సదరు మహిళకు పునర్జన్మ ఇచ్చారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్‌లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళకు పునర్జన్మ అందించారు. అమృత్‌సర్‌కు చెందిన కుల్బీర్ కౌర్ కొన్నేళ్లుగా విపరీతమిన కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. సదరు మహిళ కడుపులో ఓ పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని తీయడానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పడంతో.. వారు చాలా ఆసుపత్రులకు తిరగారు. ఇక చివరికి నాగ్‌కలాన్‌లోని బాబా ఫరీద్ ఛారిటబుల్ ఆస్పత్రికి వెళ్ళగా.. అక్కడి డాక్టర్ ఆమెకు తక్కువ ఖర్చుతో సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి.. దాదాపు 3.5 కిలోల బరువున్న కణితిని తొలగించారు. ఆ మహిళకు పునర్జన్మ అందించారు.