Shuttlecock: షటిల్‌ కాక్‌ ఈకలు ఏ పక్షివో తెలుసా.? ఎలా తయారు చేస్తారంటే..

ఇక పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ లాంటి వారి అద్భుత ఆటతీరుతో కూడా బ్యాడ్మింటన్‌ గేమ్‌ చాలా మందికి సుపరిచితమైంది. ఇదిలా ఉంటే ఈ గేమ్‌లో ఉపయోగించే షటిల్‌ కాక్‌ తయారీ ఎంతో నైపుణ్యంతో కూడుకుని ఉంటుందని తెలిసిందే. తక్కువ బరువతో ఉండే షటిల్‌కాక్‌ బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. అయితే ఇలా దూసుకెళ్లడానికి దీని తయారీ...

Shuttlecock: షటిల్‌ కాక్‌ ఈకలు ఏ పక్షివో తెలుసా.? ఎలా తయారు చేస్తారంటే..
Shuttlecock
Follow us

|

Updated on: Aug 27, 2024 | 10:41 AM

బ్యాడ్మింటన్‌ గేమ్‌ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది చిన్నారులతో పాటు పెద్దలు కూడా బ్యాడ్మింటన్‌ ఆడుతుంటారు. ఇటీవల బ్యాడ్మింటన్‌ ఒక వ్యాయామంలా మారింది. చాలా మంది ఉదయం, సాయంత్రం బ్యాడ్మింటన్‌ను వ్యాయామంలో ఒక భాగం చేసుకుంటున్నారు. కాళ్లు, చేతులను వేగంగా కదిలించడంతో పాటు.. కోర్టు మొత్తం కలియతిరగడం కారణంగా ఈ గేమ్‌ ఒక మంచి వర్కవుట్‌లా మారింది.

ఇక పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ లాంటి వారి అద్భుత ఆటతీరుతో కూడా బ్యాడ్మింటన్‌ గేమ్‌ చాలా మందికి సుపరిచితమైంది. ఇదిలా ఉంటే ఈ గేమ్‌లో ఉపయోగించే షటిల్‌ కాక్‌ తయారీ ఎంతో నైపుణ్యంతో కూడుకుని ఉంటుందని తెలిసిందే. తక్కువ బరువతో ఉండే షటిల్‌కాక్‌ బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. అయితే ఇలా దూసుకెళ్లడానికి దీని తయారీ విధానమే కారణమని మీకు తెలుసా.? ఇంతకీ షటిల్‌ కాక్‌ను ఎలా తయారు చేస్తారు..? భారత్‌లో బ్యాడ్మింటన్‌ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో బ్యాడ్మింటన్‌ గేమ్‌ 1873లో ప్రవేశపెట్టారు. 1873లో పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంగ్లీష్ ఆర్మీ అధికారులు ఈ గేమ్ ఆడారు. ఆ సమయంలో డ్యూక్ ఆఫ్ బ్యూఫోర్ట్ గౌరవార్థం ఊరేగింపు నిర్వహించారు. డ్యూక్ కంట్రీ ఎస్టేట్ పేరు బ్యాడ్మింటన్.. అందుకే ఈ గేమ్‌కు బ్యాడ్మింటన్ అనే పేరు వచ్చింది. గ్రేట్ బ్రిటన్‌లో 1893లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఈ గేమ్‌కు మరింత ప్రజాదరణ లభించింది. 1934 నాటికి ఈ గేమ్ అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో బ్యాడ్మింటన్‌ ప్రాచుర్యంలో ఉంది.

ఇక బ్యాడ్మింటన్‌ అనగానే షటల్‌ కాక్‌ గుర్తొస్తుంది. సాధారణంగా ఈ కాక్‌ నిర్మాణంలో ఉపయోగించే ఈకలు కోడివి అనుకుంటారు. కాక్‌ అనే కోడి అని అర్థం వల్లే ఇలా అనుకుంటారు. అయితే నిజానికి వీటి తయారీలో ఉపయోగించేవి బాతు ఈకలు. చైనాలో గూస్‌ పక్షి ఈకలను ఉపయోగిస్తే.. భారత్‌లో బాతు ఈకలను వాడుతారు. ఇందుకోసం ముందుగా బాతు ఈకలను సేకరిస్తారు. అనంతరం వాటిని నీటిలో శుభ్రంగా కడుగుతారు. తర్వాత ఒక్కొక్కటిగా ఏరుతూ.. వాటిని షటిల్‌కాక్‌కు సెట్‌ అయ్యేలా కట్ చేస్తారు. ఆ తర్వాత చిన్న బంతి చుట్టూ చేర్చి దారం, జిగురుతో ఒకదానికొకటి లింక్‌ చేస్తారు. షటిల్‌ కాక్‌ బరువు 1.7 గ్రాముల నుంచి 2.1 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ కాక్‌ను శంఖువు ఆకారంలో రూపొందిస్తారు. ఈ ఆకారం కారణంగానే షటిల్‌ కాక్‌ ఎంత వేగంలో ఉన్నా సరైన దిశలో వెళ్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?