AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream: కలలో మీ శత్రువులు కనిపిస్తున్నారా.? దాని అర్థం ఏంటో తెలుసా..

కలలో మీకు ఒకవేళ మీ శత్రువులు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే.. మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే.. ఏవో పరిష్కారం కానీ వివాదాలు మీలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీరు మరింత పై స్థాయికి ఎదగాలన్నా సందేశాన్ని కూడా ఈ మెసేజ్‌ ఇస్తుంది...

Dream: కలలో మీ శత్రువులు కనిపిస్తున్నారా.? దాని అర్థం ఏంటో తెలుసా..
Dream
Narender Vaitla
|

Updated on: Sep 07, 2024 | 7:18 PM

Share

కలలో మనకు కనిపంచే అంశాలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే మనకు వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కలలో కొన్ని భయపెట్టే అంశాలు ఉంటే, మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి. అయితే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మరి కలలో మన శత్రువులు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో మీకు ఒకవేళ మీ శత్రువులు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే.. మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే.. ఏవో పరిష్కారం కానీ వివాదాలు మీలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీరు మరింత పై స్థాయికి ఎదగాలన్నా సందేశాన్ని కూడా ఈ మెసేజ్‌ ఇస్తుంది. మీకు నిజ జీవితంలో శత్రువులు ఎవరూ లేకపోయినా తెలియని వ్యక్తితో గొడవ పడుతున్నట్లు కల వస్తే త్వరలోనే మీరు ఏవో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోవాలి. పలు విషయాల్లో జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.

ఇక మీతో మీరే గొడవ పడుతున్నట్లు కల వస్తే.. మీ మనసులో తెలియని ఏవో భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా ఏదో సమస్యతో వెంటాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే కేవలం శత్రువులతోనే కాకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు కలలో కనిపిస్తే.. చెడు సంకేతంగా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. పనులు అర్థాంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.

కలలో ఇతరులతో గొడవ పడుతున్నట్లు కనిపిస్తే.. మీ పురోగతికి అడ్డుకట్ట పడబోతుందని అర్థం చేసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఏదో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్