AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయా.? దేనికి సంకేతమో తెలుసా..

భోజనం చేసే సమయంలో అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయి. అయితే వంటి చేసే సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అయితే ఇలా వెంట్రుకలు కనిపించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అన్నంలో వెంట్రుకలు కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

Astrology: అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయా.? దేనికి సంకేతమో తెలుసా..
Rice
Narender Vaitla
|

Updated on: Nov 18, 2024 | 8:29 AM

Share

అన్నాన్ని దైవంతో సమానంగా భావించే కల్చర్ మనది. అందుకే భోజనం చేసే ముందు నమస్కరించిన తింటుంటాం. కంచెంలో అన్నాన్ని వదిలస్తే దోషంగా భావిస్తుంటాం. పురాణాల్లో కూడా అన్నానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తినేప్పుడు కొన్ని వెంట్రుకలు వస్తుంటాయి.

వంట చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు అడపాదడపా వస్తూనే ఉంటాయి. అయితే ఇలా అన్ని తినే సమయంలో వెంట్రుకలు రావడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది అశుభంగా భావించాలని పండితులు సూచిస్తున్నారు. అన్నంలో వెంట్రుకలు రావడం పితృదోషానికి సంకేతంగా భావించాలని అంటున్నారు. పూర్వీకుల అసంతృప్తి కారణంగా ఇలా జరుగుతాయని అంటున్నారు.

దీనికి కారణంగా పితృపక్ష సమయంలో వారిని గౌరవించకపోవడం కారణం అయ్యుండొచ్చని పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి తప్పులు చేయడం వల్ల పూర్వీకుల్లో అసంతృప్తి ఏర్పడుతుందని చెబుతున్నారు. దీనికారణంగానే తరచూ అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయని అంటున్నారు. ఇక అన్నంలో వెంట్రుకలు రావడం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభకు వంటి సమస్యలకు ఓ హెచ్చరిక లాంటిదని చెబుతున్నారు.

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేందుకు కూడా ఇది ఒక సంకేతంగా భావించాలని అంటున్నారు. తరచూ ఇలా అన్నంలో వెంట్రుకలు వస్తుంటే. పితృదేవతల అసంతృప్తిగా భావించి వారి ఆచార వ్యవహారాలను గురించి తెలుసుకోవాలి. వారిని శాతింపజేయడానికి పితృ పక్ష సమయంలో తర్పణం చేయాలి. నదులు ప్రవహించే చోట పిండాలు సమర్పించడం, పూర్వీకుల పేరు మీద అన్నదానం వంటివి చేయాలని చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..