Fact: ఒక కన్ను తెరిచి నిద్రించే జీవుల గురించి మీకు తెలుసా.? ఆసక్తికర విషయాలు..

సముద్రంలో జీవించే వేల్ ఫిష్‌ ఒంటి కన్నుతో జీవిస్తాయని మీకు తెలుసా.? అత్యంత ప్రమాదకరమైన జీవిగా పరిగణించే ఈ జీవి ఒక కన్ను తెరిచి జీవిస్తుంది. తిమింగలంతో పాటు డాల్పీన్లు కూడా ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ జీవులు ఒక కన్ను తెరిచి నిద్రించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Fact: ఒక కన్ను తెరిచి నిద్రించే జీవుల గురించి మీకు తెలుసా.? ఆసక్తికర విషయాలు..
Facts
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2024 | 8:45 PM

ఈ భూమ్మీద ఎన్నో రకాల జీవులు ఉంటాయి. ఒక్కో జీవికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకతలు కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సాధారణంగా ఏ జీవి అయినా పడుకునప్పుడు రెండు కళ్లు మూసుకుని నిద్రిస్తాయని తెలిసిందే. అయితే కొన్ని రకాల జీవులు మాత్రం ఒంటి కన్నుతో నిద్రిస్తాయని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా జీవులు.? అవి అలా నిద్రించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సముద్రంలో జీవించే వేల్ ఫిష్‌ ఒంటి కన్నుతో జీవిస్తాయని మీకు తెలుసా.? అత్యంత ప్రమాదకరమైన జీవిగా పరిగణించే ఈ జీవి ఒక కన్ను తెరిచి జీవిస్తుంది. తిమింగలంతో పాటు డాల్పీన్లు కూడా ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ జీవులు ఒక కన్ను తెరిచి నిద్రించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ జీవులు నిద్రపోతున్న సమయంలో కూడా పరిసర ప్రాంతాలను పర్వవేక్షిస్తూనే ఉంటాయి. అదే విధంగా అనుభూతిని కూడా చెందుంతుంటాయి. డాల్ఫి, తిమింగలం ఈ రెండూ జీవుల మదెడులోని ఒక భాగం మాత్రమే మూసి వేసి ఉంటుంది. ఉదాహరణకు ఈ జీవులు కుడి కన్ను మూసుకొని నిద్రిస్తే వాటి మెదడులోని ఎడమ భాగం తెరుచుకొన ఉంటుంది. అదే విధంగా ఎడమ కన్ను మూసుకొని పడుకుంటే.. మెదడులోని కుడి భాగం ఓపెన్‌ అయి ఉంటుంది. ఒకవేళ ఈ జీవి మెదడు పూర్తిగా ఆగిపోతే.. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతుందని నిపుణులు అంటారు.

ఇక ఒక కన్ను తెరిచి నిద్రించే వాటిలో మొసలి కూడా ఒకటని నిపుణులు చెబుతారు. ఆస్ట్రేలియాకు చెందిన జీవశాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో తేలిన అంశాల ప్రకారం.. మొసళ్లు కూడా ఒక కన్ను తెరిచి నిద్రపోతాయని అంటున్నారు. ఇలా మొసలి కూడా నిత్యం అలర్ట్‌లో ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఈ జీవులు తమను తాము ఇతరుల జంతువుల నుంచి రక్షించుకునేందుకే ఇలాంటి వ్యవస్థ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..