White House: అత్యంత సురక్షితమైన భవనాల్లో ఇదీ ఒకటి.. వైట్ హౌజ్ ప్రత్యేకతలు మీకు తెలుసా?
అమెరికా అనగానే ముందుగా గుర్తొచ్చేది వైట్ హౌజ్. అమెరికా అధ్యక్ష భవనంగా మాత్రమే కాకుండా, ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరు గాంచిన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ వైట్ హౌజ్‌లో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అగ్రరాజ్యం, ప్రపంచానికే పెద్దన్న అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. డోనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని నమోదు చేసుకొని దేశాధ్యక్షుడిగా నిలిచారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు సంబంధించి తెలుసుకోవడానికి నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత సురక్షిత భవనంగా చెప్పుకొచ్చే వైట్ హౌజ్‌లో ఉన్న ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ హౌజ్ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అనే విషయం తెలిసిందే. ఇది అమెరికన్ ప్రజాస్వామానికి చిహ్నం కూడా. అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు అత్యాధునిక సౌకర్యాలకు వైట్ హౌజ్ పెట్టింది పేరు. వైట్ హౌజ్‌లో ఎన్నో ఆసక్తికరమైన ప్రత్యేకతలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ వైట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభం కాగా 1800లో పూర్తయింది . దీనిని ఐరిష్ ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ రూపొందించారు . దీనిని నియోక్లాసికల్ శైలిలో నిర్మించారు. కాగా 1814లో బ్రిటిష్ సైన్యం వాషింగ్టన్‌పై దాడి చేసి వైట్‌హౌస్‌ను తగలబెట్టింది. అయితే ఆ తర్వాత వైట్ హౌజ్‌ను పునర్నిర్మించారు . ఇక వైట్ హౌజ్‌లో ఉన్న సౌకర్యాల విషయానికొస్తే.. 132 గదులు , 35 స్నానపు గదులతో పాటు మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి. ఇందులో స్టేట్ డైనింగ్ రూమ్ , ఓవల్ ఆఫీస్ , మ్యాప్ రూమ్‌తో పాటు ఎన్నో ప్రత్యేక గదులు ఉన్నాయి.
వైట్ హౌజ్ లోపలి అలంకరణ ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటారు. ఇది అమెరికా చరిత్ర, సంస్కృతికి నిలువుటద్దంలా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన భవనాల్లో వైట్ హౌజ్ ఒకటి. ఇందులో అత్యాధునిక భద్రతా పరికరాలు, వేలాది CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద జిమ్ , స్విమ్మింగ్ పూల్ , సినిమా హాలు ఉంటుంది.
ఇక వైట్ హౌజ్‌లో ఒక బంకర్ కూడా ఉంది. దీనిని సిట్యుయేషన్ రూమ్ అని పిలుస్తారు . ఈ బంకర్‌లో ప్రెసిడెంట్, అతని అగ్ర సలహాదారులను అత్యవసర పరిస్థితుల నుంచి తప్పించుకునేలా నిర్మించారు. ఈ భవనం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి . ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు వైట్ హౌజ్‌ను సందర్శిస్తుంటారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..