AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti suzuki Dzire: సరికొత్త లుక్ తో కొత్త మారుతీ డిజైర్.. మార్కెట్ లోకి విడుదల ఎప్పుడంటే..?

పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఉద్యోగ, వ్యాపార అవసరాల నేపథ్యంలో దేశంలో కార్ల వినియోగం ఎక్కువైంది. మధ్య తరగతి కుటుంబాలు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నాయి. తిండి, బట్ట, గూడుతో పాటు కారు కూడా కనీస అవసరాల జాబితాలోకి చేరుతోంది. దేశంలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ కార్ల కంపెనీలు అనేక మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.

Maruti suzuki Dzire: సరికొత్త లుక్ తో కొత్త మారుతీ డిజైర్.. మార్కెట్ లోకి విడుదల ఎప్పుడంటే..?
New Maruti Suzuki Dzire
Nikhil
|

Updated on: Nov 07, 2024 | 5:30 PM

Share

ప్రజల నమ్మకాన్ని. అభిమానాన్ని పొందిన కార్ల కంపెనీలలో మారుతీ సుజుకీ ఒకటి. దీని నుంచి విడుదల కానున్న ఫోర్త్ జనరేషన్ డిజైర్ కారుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవీకరించిన ఈ మారుతీ డిజైర్ కారు నవంబర్ 11న విడుదల కానుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్ కాంపాక్ట్ సెడాన్ కార్లలో మారుతీ సుజికి డిజైర్ ఒకటి. దీనిలో నాలుగో తరం అవతార్ ను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్ ను ఏలుతున్న హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ కార్లకు కొత్త డిజైర్ పోటీగా నిలుస్తుందని మార్కెట్ నిఫుణులు అంచనా వేస్తున్నారు.

కొత్త డిజైర్ కారు ముందు భాగంలో అందమైన దీర్ఘచతురస్రాకార ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ లు, ఆధునీకరించిన బంపర్, సరికొత్త సెవెన్ స్లాట్ గ్రిల్, వెనుక భాగంలో రీ డిజైన్ చేసిన బంపర్, టెయిల్ ల్యాంపులు. 15 అంగుళాల 8 స్పోక్ అల్లాయ్ వీల్స్, 185/65 ఆర్15 టైర్లు, కొత్తగా రూఫ్ లైన్ ఆకట్టుకుంటున్నాయి. లోపల క్యాబిన్ కూడా కొత్త లుక్ తో అప్ డేట్ చేశారు. డ్యాష్ బోర్డు లేఅవుట్, ఎంఐడీ స్క్రీన్ తో అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, కప్ హోల్డర్లతో కూడిన రియర్ ఆర్మ్ రెస్ట్, వెనుక వైపు డ్యూయల్ చార్జింగ్ పోర్టులు, ముందు వైర్ లెస్ చార్జర్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు.

ఇక 1.2 లీటర్ మూడు సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోలు ఇంజిన్ అమర్చారు. దాని నుంచి 80 బీహెచ్ పీ, 112 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలలో ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఏఎంటీ ఉన్నాయి. మారుతీ సుజుకీ తన తాజా కాంపాక్ట్ సెడాన్ అయిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ కోసం బుక్కింగ్ లను ప్రారంభించింది. కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి ప్రీ బుక్కింగ్ చేసుకోవచ్చు. మారుతీసుజుకి.కామ్/డిజైర్ వెబ్ సెట్ ద్వారా లేదా సమీపంలోని మారుతీ సుజుకీ షోరూమ్ లకు వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి