UPI Lite: యూపీఐ లైట్‌తో పేమెంట్లు టాప్.. ఈ ఫీచర్లు గురించి తెలుసా..?
గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ వాలెట్లు భారతదేశంలోని కస్టమర్లకు చెల్లింపు అనుభవాలను విప్లవాత్మకంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా క్షణాల్లో పేమెంట్లు అయిపోతుండడంతో యూపీఐ సేవలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన యూపీఐ లైట్ సేవలు పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ చెల్లింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. యూపీఐ లైట్ చిన్న లావాదేవీల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. యూపీఐకు సంబంధించిన సరళీకృత వెర్షన్‌గా యూపీఐ లైట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది వాలెట్ లైసెన్స్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్, థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ కోసం సంబంధిత రెగ్యులేటరీ కాంప్లెక్సీలు అవసరం లేకుండా వాలెట్ లాంటి ఫంక్షనాలిటీ సౌలభ్యాన్ని అందిస్తుంది. యూపీఐ లైట్ తక్కువ విలువ లావాదేవీల కోసం పిన్ నమోదు అవసరం లేకుండా సింగిల్ క్లిక్ చెల్లింపులను అనుమతిస్తుంది.
ఆటో టాప్-అప్ ఫీచర్
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సమయంలో పరిచయం చేసిన ఈ ఫీచర్ యూపీఐ లైట్‌ని మరింతగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు యూపీఐ లైట్ ఆటోమేటిక్‌గా టాప్ అప్ చేస్తుంది. మొబైల్ వాలెట్‌లలో ప్రసిద్ధి చెందిన ఆటో-రీఛార్జ్ ఫంక్షన్ లాగానే అంతరాయం లేని చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది.
పెరిగిన లావాదేవీ పరిమితులు
ప్రారంభంలో రూ.200కి పరిమితమైన యూపీఐ ప్రతి లావాదేవీ పరిమితిని రూ.500కి, రూ.1000కి పెంచారు. యూపీఐ లైట్ ద్వారా నిర్వహించే లావాదేవీల పరిధిని గణనీయంగా విస్తరించింది. ఇది రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూపీఐ లైట్‌ని రోజువారీ లావాదేవీల కోసం మరింత బహుముఖంగా మార్చింది. ఇది చిన్న విలువ కొనుగోళ్లకు వాలెట్‌లకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి