Ayushman Bharat: ఆ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ పథకం వారికి ప్రత్యేకం

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై) ద్వారా పేదలకు వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల కోసం కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లందరికీ కూడా ఈ పథకం ద్వారా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందించింది.

Ayushman Bharat: ఆ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ పథకం వారికి ప్రత్యేకం
Ayushman Card
Follow us
Srinu

|

Updated on: Nov 07, 2024 | 5:00 PM

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రతను అందించేందుకు కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 6 కోట్ల మంది వృద్ధులు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల చొప్పున బీమా కవరేజీ అందిస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డ్ అందించనున్నారు. అయితే ఈ కార్డు ద్వారా వైద్య సేవలను అందించే ఆస్పత్రుల గురించి చాలా మందికి తెలియదు. అయితే నేషనల్ హెల్త్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. టూల్‌బార్‌లో ’70+ కోసం పీఎంజేఏవైను సెలెక్ట్ చేయాలి. అనంతరం సమగ్ర జాబితాను వీక్షించడానికి ‘ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్ జాబితా’ని ఎంచుకోండి. అంతే రాష్ట్రం ఆధారంగా ఆస్పత్రుల జాబితా డిస్ ప్లే అవుతుంది.

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు ఇలా

ఆన్‌లైన్ అప్లికేషన్

సీనియర్ సిటిజన్లు తమ ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ యాప్ ద్వారా సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌హెచ్ఏ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.  ఓటీపీ ఎంటర్ చేశాక70+ బ్యానర్ కోసం పీఎంజేఏవై క్లిక్ చేయాలి. మీ రాష్ట్రం, జిల్లా, ఆధార్ నంబర్‌ను అందించాలి. ఆధార్ ఓటీపీని ఉపయోగించి మీ కేవైసీని పూర్తి చేయాలి.  ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయాలి. మీ అప్లికేషన్ ఆమోదించాక మీ ఆయుష్మాన్ వయ వందన కార్డ్ కేవలం 15 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొబైల్ యాప్ 

గూగుల్ ప్లే స్టోర్‌లో ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను పూర్తి చేసి, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఆధారంగా లాగిన్ అవ్వాలి. మీ ఆధార్ సమాచారాన్ని పూరించి ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తూ, లబ్ధిదారునికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వివరాలను నమోదు చేశాక రిజిస్ట్రేషన్ తర్వాత కొద్దిసేపటికే కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి