Volcano Erupts: బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..

Volcano Erupts: బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..

|

Updated on: Nov 07, 2024 | 5:13 PM

ఇండోనేసియాలోని మౌంట్‌ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్టు సమాచారం. ఫ్లోర్స్‌ దీవిలోని మౌంట్‌ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనాలు డేంజర్‌ జోన్‌ను దాటిపోయాయని అధికారులు ప్రకటించారు.

అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని అని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ సెంటర్ ప్రతినిధి తెలిపారు. ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా ప్రకటించామన్నారు. ఈ ఏడాది మేలో హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం చెందడంతో 60 మందికి పైగా మరణించారని, సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us