Palmistry: అరచేతిలో ఈ ఆకారం ఉందా.? అయితే 35 ఏళ్ల తర్వాత మీ సుడి మాములుగా ఉండదంటా..

|

Oct 29, 2022 | 5:35 PM

భవిష్యత్తు గురించి తెలసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ స్థానంలో ఉంటాం.? ఎలాంటి ఉద్యోగాలు చేస్తాం.? జీవితంలో ఎలా సెటిల్‌ అవుతాం.? సహజంగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు..

Palmistry: అరచేతిలో ఈ ఆకారం ఉందా.? అయితే 35 ఏళ్ల తర్వాత మీ సుడి మాములుగా ఉండదంటా..
Palmistry
Follow us on

భవిష్యత్తు గురించి తెలసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ స్థానంలో ఉంటాం.? ఎలాంటి ఉద్యోగాలు చేస్తాం.? జీవితంలో ఎలా సెటిల్‌ అవుతాం.? సహజంగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా భవిష్యత్తును అంచనా వేయడంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న విషయం తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల విధానాలు ఉంటాయి. అందులో హస్త సాముద్రికము ఒకటి. అంటే అరచేతిలో ఉండే గీతల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం.

హస్తసాముద్రికతను నమ్మే వారు మనలో చాలా మంది ఉంటారు. అంతేనా ఈ శాస్త్రంపై ఎంతో పట్టు సాధించిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ కాన్సెప్ట్‌తో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అంతలా దీనిపై ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఈరోజు హస్త సాముద్రికతకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకుందాం. అరచేతిలో ఉండే ‘V’ ఆకారం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తుంది, హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

అర చేతిలో ఉండే హార్ట్ లైన్‌ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ హార్ట్‌ లైన్‌ చివరల్లో ‘V’ ఆకారం ఉంటుంది. అరచేతిలో ఉండే ఈ ఆకారం అదృష్టానికి చిహ్నంగా చెబుతుంటారు. వీళ్లు చాలా అదృష్టవంతులని, జీవితాల్లో విజయాలను అందుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు, కీర్తి వంటిని సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన అంశాలు హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయత నిరూపణ లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్నితాజా వార్తల కోసం క్లిక్ చేయండి..