Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: కేఏ పాల్.. మునుగోడులో మీడియా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ఏకైక మొనగాడు

వార్ వన్ సైడ్ అయింది. మునుగోడులో గెలిచేది నేనే అంటున్నారు కేఏ పాల్. మునుగోడులో ఆయన జోరు.. డైలాగులు వింటే, యాక్షన్ చూస్తే వారెవ్వా అనాల్సిందే.

Munugode Bypoll: కేఏ పాల్.. మునుగోడులో మీడియా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ఏకైక మొనగాడు
KA Paul
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2022 | 5:20 PM

ఇప్పుడు తెలంగాణను ఊపేస్తోంది రింగ్‌ పాల్‌టిక్స్‌. యస్‌… ఇది పాలిటిక్స్‌ కాదు. పాల్‌, పాల్‌, కేఏ పాల్‌టిక్స్‌. తెలంగాణను మునుగోడు ఎన్నికల ఫీవర్‌ ఊపేస్తుంటే, కేఏ పాల్‌ మునుగోడును తన మాటలు చేష్టలతో ఊపేస్తున్నారు. మునుగోడులో పాల్‌ రాకముందు ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క అన్నట్టు సాగుతోంది ఎన్నికల ప్రచారం. ఆయన సందట్లో సడేమియా కాదు. ఉపఎన్నికలో బడేమియా. పాల్ మార్క్‌ పాలిటిక్స్‌లో తీన్మార్‌ సన్నివేశాలు, వేషాలు ఎన్నో ఎన్నెన్నో. కోపాల్‌, తాపాల్, శాపాల్, సవాల్‌ మాత్రమే కాదు, నవ్వుల పువ్వుల్‌ కూడా వెల్లివిరుస్తున్నాయి.

మునుగోడు ఓటర్లలో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు కేఏ పాల్‌. రోజుకో వెరైటీ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఓచోట ఆయన తీన్మార్‌ స్టెప్పులకు జనం ఈల, గోలతో హోరెత్తించారు. సెలూన్‌లోకెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకుంటూ వీడియోలకు ఫోజులిచ్చారు. స్వీట్లు పంచుతూ అందరినీ మచ్చిక చేసుకుంటున్నారు. చెప్పులు కుడుతూ హల్చల్‌ చేశారు. కొంత మంది ఓటర్లకు స్వీట్లు, వాటర్ బాటిళ్లు పంచారు. స్వయంగా చాయ్ పెట్టి ప్రజలకు పోశారు. రైతు మాదిరిగా వేషం కట్టి చేలో పత్తి తీశారు. సైకిల్ తొక్కారు. తాజాగా మీడియా లోగోలు తన ముందు టేబుల్‌పై పెట్టగా.. ఆ పక్కనే ఉన్న కుర్చీలపై పడుకుని సేద తీరుతున్నారు. ఏది ఏమైనా మునుగోడులో పాల్‌ మీడియాను అట్రాక్ట్ చేసినట్లుగా.. ఏ లీడర్ కూడా ఆకర్షించలేదనే చెప్పాలి. ప్రజంట్ ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

పన్లోపనిగా బీజేపీ వాళ్లు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ పొలిటికల్ ఎటాక్ కూడా షురూ చేశారు కేఏ పాల్.  60 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కేవలం 6 నెలల్లో చేసి చూపిస్తా.. మునుగోడులో ఒక్కో మండలానికి ఒక్కో కాలేజీ, ఉచిత ఆస్పత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇస్తానంటున్నారు ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న కేఏ పాల్. 60 శాతం మంది ఓటర్లు ఇప్పటికే తన ఓటెయ్యాలని ఇప్పటికే డిసైడయ్యారని తెలిపారు. ఇంకొంచెం కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..